Jump to content

పుట:DivyaDesaPrakasika.djvu/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల యాత్రకు వెళ్ళే భక్తులకు విజ్ఞప్తి

భక్తులారా ! భాగవతోత్తములారా!

శక్తి సామర్ద్యములు గల స్త్రీ పురుషులు ఆబాలగోపాలము గోవింద నామోచ్చారణం చేస్తూ కాలినడకతో కొండనెక్కి వెళ్ళండి అవసరమైతే తిరిగివచ్చేటప్పుడు బస్‌లో రావచ్చును.

స్నానంచేసి భారతీయ సంప్రదాయంప్రకారం శుచి శుభ్రములైన వస్త్రములను దరించి వారి వారి సంప్రదాయానుసారం బొట్టు పెట్టుకొని(శ్రీవేంకటేశ్వరుని సన్నిధానమున ఊర్థ్వ పుండ్రమును ధరించుట(నామము) సంప్రదాయము) శ్రద్దా భక్తులతో సేవించండి.

స్వామివారిని సేవింపనిదే భుజింపకండి. ఆలస్యమగు పక్షమున శక్తిలేనిచో పండ్లు పాలు వంటివి తగుమాత్రం తీసికొనండి. ద్వజస్తంభం వద్ద నమస్కరించి మనస్సులో శ్రీహరి రూపాన్ని ధ్యానిస్తూ గోవింద నామం జపిస్తూ లోనికి వెళ్ళండి. ప్రధాన ద్వారం దగ్గరకురాగానే గరుడాళ్వార్లకు నమస్కరించండి. ద్వారపాలకులకు అంజలి ఘటించి వారి అనుమతిని తీసికొని ఎదురుగాసేవ సాయించుచుండు స్వామివారి దివ్యమంగళ విగ్రహమును కండ్లు చెమర్చగా, శరీరం పులకరింపగా; గద్గదమగు కంఠముతో, పారవశ్యంతో దర్శించండి.

శ్రీవారి పాదారవిందములు; పీతాంబరం, శ్రీహస్తములు;వక్షస్థలమునగల శ్రీభూదేవులను శంఖచక్రములను, ముఖారవిందమును;రత్నఖచిత కిరీటమును దర్శించి తిరిగి పాదారవింద పర్యంతము సేవించండి. అంజలి ఘటించి ఈక్రింది శ్లోకాలను, పాశురాలను పఠించండి.

   పార్దాయ తత్సదృశ సారథినా త్వయైవ
   యౌదర్శితౌ స్వ చరణౌ శరణం వ్రజేతి
   భూయోపి మహ్య మిహతౌ కరర్శితౌతే
   శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే

   వినావేంకటేశం ననాథో ననాథ:
   సదావేంకటేశం స్మరామి స్మరామి
   హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
   ప్రియం వేంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ.

ఈ శ్లోకాలను అనుసంథానం చేయండి.

దివ్యప్రబన్దం వచ్చినవారు "అగలిగిల్లేన్ ఇఱైయుమెన్ఱు" "తాయేతన్దై యెన్ఱుమ్‌" అనే పాశురాలను అనుసంధానం చేయండి.

                                               128