మహాభక్తురాలగు తరిగొండ వేంగమాంబ యీస్వామి వైభవమును కావ్యముగా రచించుటయేగాక స్వామి మహిమలను ప్రత్యక్షముగా నిరూపించినది.
తిరుమల తిరుపతి దేవస్థానం వారి సేవలు
శ్రీవేంకటాచలపతి యావద్బారతమున ఆరాధింపబడు దేవాధిదేవుడు. కావుననే
"వేజ్కటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన
వేజ్కటేశ నమో దేవో నభూతో నభవిష్యతి||
అని ప్రస్తుతించారు మన పెద్దలు.
అట్టి ఈక్షేత్రాన్ని నేడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గమువారు అధికారులు అనన్యాదృశమైన రీతిలో తీర్చిదిద్దుతున్నారు. నానాటికి యాత్రికుల రద్దీ పెరుగుతుండడంతో అధునిక సౌకర్యాలతో, అనేక సత్రములను కాటేజీలను, కల్యాణ కట్టలను ఉచిత భోజనశాలలను, ప్రసాద వినియోగములను; ఉచిత వైద్యశాలలను, ఉపన్యాస వేదికలను, క్యూ కాంప్లెక్సులను, వానిలో టీవీల ద్వారా సన్నిధి కార్యక్రమాలను మున్నగు వానిని ఏర్పాటుచేసి చక్కగా నిర్వహించుచున్నారు. నేడు తిరుమలయాత్ర పరమాహ్లాదకర యాత్రగా నున్నది. తిరుపతిలో తి.తి.దేవస్థానం వారు నిర్వహించుచున్న పురావస్తు ప్రదర్శనశాల; ఓరియంటల్ మానిస్క్రిప్టు లైబ్రరీ, ప్రాచీన ఓరయంటల్ కళాశాల, వేద ఆగమ, దివ్య ప్రబన్ద పాఠశాల, శిల్పసంగీత నృత్యకళాశాల, అనేక కళాశాలలు, ఉన్నత పాఠశాలలు ప్రాచీన నవీన విజ్ఞాన వికాసములకు తోడ్పడుచున్నవి.
ఇట్లే వీరు నిర్వహించుచున్న శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు; ఆళ్వార్ దివ్యప్రబన్ద ప్రాజెక్టు; భాగవత ప్రాజెక్టు; దార్మిక గ్రంథముల ముద్రణకు సహాయము మున్నగునవి బహుముఖములుగా ధర్మ ప్రచారమునకు తోడ్పడుచున్నవి. అనేక నగరములలో కల్యాణ మండపములు నిర్మించి శిధిలములైన దేవాలయములను జీర్ణోద్దరణగావించి ఆయాప్రాంత వాసులకు మహోపకారము చేయుచున్నారు.
"వృక్షోరక్షతి రక్షిత:" అనే నినాదంతో తిరుమల పరిసర ప్రాంతములను ఘనవన శ్యామలములను గావించుచున్నారు. వీరేర్పాటుచేసిన జంతువుల పార్కులు, అభయారణ్యములు, అనాథశరణాలయాలు మున్నగునవి జీవకారుణ్యానికి నిదర్శనం.
మార్గము: ఈ క్షేత్రమునకు భారతదేశపు నలుమూలలనుండి ప్రయాణ వసతి కలదు. ఇంతటి ప్రయాణ సౌకర్యములు మరియే క్షేత్రమునకు లేవు.
127