పుట:DivyaDesaPrakasika.djvu/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

88. తిరుప్పుళ్‌కుழி (కాంచీ) 15

శ్లో. జటాయు తీర్థ రుచిరే తిరుప్పుళ్ కుళి పట్టణే
   శ్రీ మరకత వల్లీతి దేవ్యా విజయరాఘవ:|
   ఉపవిష్ట:ప్రాజ్ముఖస్సన్ జయకోటి విమానగ:|
   జటాయు గోచారవపూ రాజతే కలిజిన్నుత:||

వివ: విజయరాఘవ ప్పెరుమాళ్-మరకతవల్లి-జటాయుతీర్థం-తూర్పు ముఖము-విజయకోటి విమానము-కూర్చున్నసేవ-జటాయువునకు ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఈస్వామి విషయమై శ్రీమద్వేదాంత దేశికులు షోడశాయుధ స్తోత్రమును అనుగ్రహించిరి. ఈ క్షేత్రమునందే యాదవ ప్రకాశులు శిష్యులకు వేదాంతశాస్త్రమును బోధించిరట. పిన్బழగరాం పెరుమాళ్ జీయర్ అవతరించిన స్థలము. కోవెలకు ఎదుట జటాయు మహారాజుల సన్నిధి గలదు. కుంభమాసం పునర్వసు తీర్థోత్సవము. సంతాన విషయకమైన ప్రార్థనా స్థలము.

మార్గము: మద్రాస్-వేలూర్ బస్ మార్గములో బాలిశెట్టి సత్రం వద్ద దిగిన 1/4 కి.మీ. దూరములో నున్నది. కాంచీపురము నుండి బాలిశెట్టి సత్రానికి బస్ కలదు. వసతులేమియులేవు. కంచినుండి పోయి సేవింపవలెను.

పా. అలెజ్గెழு తడక్కై యాయన్ వాయామ్బల్
          కழிయుమా లెన్నుళ్ల మెన్నుమ్;
   పులగెழு పొరునీర్ ప్పుట్కుழிపాడుమ్‌
          పోదుమో నీర్మలై క్కెన్ఱుమ్‌
   కులజ్గెழுకొల్లి క్కోమళవల్లి
          క్కొడియిడై నెడుమழைక్కణ్ణి
   ఇలజ్గెழிల్ తోళిక్నెన్నినైన్దిరున్దా
          యిడవెందై యెందై పిరానే.
          తిరుమంగై ఆళ్వార్-పెరియతిరుమొழி 2-7-8


మంచిమాట

శత్రువులకు భయపడకుము

వారును శ్రియ:పతియగు శ్రీమన్నారాయణునకు శరీరభూతులే.

                                               107