Jump to content

పుట:DivyaDesaPrakasika.djvu/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

87. పరమేశ్వర విణ్ణగరమ్‌ (కాంచీ) 14

శ్లో. పరమేశ్వర విణ్ణగర్ పురే రుచిరైరంమద తీర్థ సమ్యుతే|
   జలనాధ దిశా ముఖాసనో పరవైకుంఠ లతా సమన్విత:||
   విమానేతు ముకుందాఖ్యే శ్రీవైకుంఠ విభుస్సదా
   శ్రీ మత్పల్లవ రాజాక్షి గోచర:కలిహస్తుత:||

వివ: వైకుంఠ పెరుమాళ్- వైకుంఠ నాయకి-ఐరంమద తీర్థము-పశ్చిమ ముఖము-కూర్చున్నసేవ-ముకుంద విమానము-పల్లవరాజునకు ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఈసన్నిధి విమానము మూడు అంతస్థులుగా నున్నది. క్రింది అంతస్తులో వీత్తిరున్ద తిరుక్కోలములో వైకుంఠ పెరుమాళ్ వేంచేసియున్నారు. మొదటి అంతస్థులో శయన తిరుక్కోలమున రంగనాథులు వేంచేసియున్నారు. రెండవ అంతస్థులో నిన్ఱ తిరుక్కోలములో వేంచేసియున్నారు. గొప్ప శిల్ప కళా సంపదగల అత్యద్భుత క్షేత్రము. కంచి రైల్వే స్టేషన్‌కు 1 కి.మీ. దూరములో నున్నది.

పా. శొల్లువన్ శొఱ్పొరుళ్ తానవై యాయ్
         చ్చువై యూఱొలి నాత్‌తముమ్‌ తోత్‌తముమాయ్
   నల్లరన్ నాన్‌ముగన్ నారణను క్కిడన్దాన్
         తడ--ழ்న్దழగాయ కచ్చి;
   పల్లవన్ విల్లవన్ నెన్ఱులగిల్ పలరాయ్
         ప్పలవేన్దర్ వణజ్గు కழల్
   పల్లవన్, మల్లై యర్ కోన్ పణిన్ద
         పరమేచ్చుర విణ్ణగర మధువే.
         తిరుమంగై ఆళ్వార్-పెరియతిరుమొழி 2-9-1


మంచిమాట

            దు:ఖములను కలిగించునది ప్రకృతి
          దు:ఖములను అనుభవించువాడు జీవుడు
       మన దు:ఖములను చూచి సహించలేనిది లక్ష్మీదేవి
        మన దు:ఖములను పోగొట్టువాడు సర్వేశ్వరుడు.

                                             106