పుట:DivyaDesaPrakasika.djvu/174

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


79. తిరునీరగమ్‌ (కాంచీ)6

శ్లో. అక్రూర తీర్థ రుచిచే వీరకాఖ్యాన పట్టణే|
   విలమంగై లతానాథో జగదీశ విభుస్థిత:||
   జగదీశ్వర వైమానే ప్రాజ్ముఖో క్రూర గోచర:||
   పరకాల మునీంద్రేణ సన్నుతో భువి రాజతే||

వివ: జగదీశ్వర పెరుమాళ్-నిలమంగైవల్లి త్తాయార్-అక్రూర తీర్థము-జగదీశ్వర విమానము-తూర్పు ముఖము-నిలచున్నసేవ-అక్రూరనకు ప్రత్యక్షము-తిరుమంగై యాళ్వార్ కీర్తించినది.

విశే:మూలవర్-పుష్కరిణి-సన్నిధి ఎక్కడనున్నవో తెలియవు.ఉత్సవర్ మాత్రము ఉలగళన్ద పెరుమాళ్ సన్నిధి ఉత్తర ప్రాకారములో చిన్న సన్నిధిలో గలరు.

పా. వీరగత్తాయ్ నెడువరైయి నుచ్చి మేలాయ్
           నిలాత్తిజ్గళ్ తుణ్డత్తాయ్ నిఱైన్దకచ్చి
   ఊరగత్తాయ్, ఓణ్ తుఱైనీర్ వెஃకావుళ్ళాయ్
           ఉళ్ళువారుళ్ళత్తాయ్; ఉలగ మేత్తుమ్‌
   కారగత్తాయ్ కార్‌వానత్తుళ్ళాయ్ కళ్వా
           కామరుపూజ్కావిరియన్ తెన్బాల్ మన్ను
   పేరగత్తాయ్, పేరాదెన్నె-- నుళ్ళాయ్
           పెరుమానున్ తిరువడియే పేణినేనే
           తిరుమంగై ఆళ్వార్లు-తిరునెడున్దాణ్డగమ్‌ 8


మంచిమాట

ప్రతిబంధకములు

భగవంతుని ఆశ్రయించుటకు ప్రతిబంధకము శరీరము.
ఆచార్యుని ఆశ్రయించుటకు ప్రతిబంధకము పుత్రమిత్రాదులు.
భాగవతులనాశ్రయించుటకు ప్రతిబంధకము ధనాపేక్ష.
కైంకర్య విషయప్రీతికి ప్రతిబంధకము శబ్దాది విషయములందు ప్రీతి.
కావున ముముక్షువు ఈప్రతిబంధకములను తొలగించుకొనుటకు ప్రయత్నింపవలెను.

                    98