ఆழிయాన్ అత్తియూరాన్ "వరమ్ తరుమ్ మామణివణ్ణన్" (లోకమందలి జనులచే కీర్తింపబడువాడును చక్రహస్తుడును వరప్రదుడును కాంచీ పురవాసుడగు నీలవర్ణుడు) అని ఆళ్వారులచే కీర్తింపబడిన వరదరాజస్వామి.
శ్లో. వేగపత్త్యుత్తరే తీరే పుణ్యకోట్యాం హరి స్స్వయమ్|
వరద స్పర్వభూతానా మద్యాపి పరిదృశ్యతే||
(వేగవతీ నదీ తీర ఉత్తర భాగమున పుణ్యకోటి విమాన మధ్యమున సర్వప్రాణులకు వరప్రదుడైన శ్రీహరి స్వయముగా వేంచేసియున్నాడు) అనునట్లు వేంచేసియున్నాడు.
శ్లో. వపా పరిమళోల్లాస వాసితాధర పల్లవమ్|
ముఖం వరదరాజస్య ముగ్దస్మిత మూపాస్మహే||
అని మన పెద్దలు త్రికాలములందు ఈ స్వామిని కీర్తించుచున్నారు.
భగవద్రామానుజులు తమ బాల్యమునంతయు కాంచీపురమందే గడిపిరి. అంతియేకాక ఇచట వేంచేసియున్న వరదరాజస్వామికి నిత్యము తీర్థకైంకర్యమును నిర్వహించిరి. ఈ వరదరాజస్వామియే భగవద్రామానుజులను దర్శన ప్రవర్తకులగునట్లు అనుగ్రహించిరి.
శ్రీరంగనాథులకు తిరుప్పాణి ఆళ్వార్లు, తిరుమలై శ్రీనివాసునకు కురుంబరుత్తనంబిగార్లవలె వరదరాజస్వామికి తిరుక్కచ్చినంబిగారు ఆంతరంగిక కైంకర్యపరులు. వీరు చామర కైంకర్యమును నిర్వహించెడివారు.
భగవద్రామానుజుల వారి కోరికపై వీరు వరదరాజస్వామిని ప్రార్థించి వారి వలన తాము వినిన ఆరు వార్తలను ఎంబెరుమానార్లకు తెలియజేసిరి. వీనినే షడ్వార్తలందురు. అవి.
1. నేనే(శ్రీమన్నారాయణుడే) పరతత్త్వము. 2. జీవేశ్వరభేదమే దర్శనము. 3.ప్రపత్తియే ఉపాయము(భగవంతుని పొందుటకు సాధనము) 4. అంతిమస్మృతి అవసరములేదు. 5. శరీరావసానమందే మోక్షము. 6. పెరియనంబిగారిని (మహాపూర్ణులను) ఆశ్రయింపుడు.
ఆచార్యులందరు అభిమానించిన క్షేత్రము కాంచీపురము. ఆళవందారులు (శ్రీయామునమునులు)ఈక్షేత్రమునకు వేంచేసి భగవద్రామానుజులను "ఆముదల్వన్ ఇవన్" అని కటాక్షించిరి. ఈప్రదేశమునకు యుమువైత్తుఱవర్ తిరుముత్తమ్ అనిపేరు. ఆళవందారులు వేంచేసిన ప్రదేశమునకు కరుమాణిక్కత్త సోపానము అనిపేరు.
ఆళవందారుల ఆదేశానుసారము "తిరువరంగ ప్పెరుమాళ్ అరయర్" అనువారు తిరుక్కచ్చినంబిగారి పురుషాకారముతో వరదరాజస్వామిని ప్రార్థించి భగవద్రామానుజులను శ్రీరంగమునకు తోడ్కొని పోయిరి. ఈవిధముగా తమకు
92