పుట:DivyaDesaPrakasika.djvu/167

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కైంకర్యము చేయుచున్న భగవద్రామానుజులను త్యాగము చేయుటచే ఈక్షేత్రమునకు త్యాగమండపమని పేరు. ఈ సంఘటన జరిగిన ప్రదేశమునకు "కచ్చిక్కువాయ్‌త్తాన్ మండపం" అనిపేరు.

ఇచట వేంచేసియున్న తాయార్లకు పెరుందేవిత్తాయార్ అని పేరు. వీరిని గూర్చి మన పెద్దలు ప్రతినిత్యము.

    ఆకారత్రయ సంపన్నా మరవింద నివాసనీమ్‌|
    ఆశేష జగదీశిత్రీం వందే వరద వల్లభామ్‌||

(అనన్యార్హ శేషత్వ, అనన్య శరణ్యత, అనన్య భోగ్యత్వములనే ఆకారత్రయ సంపన్నురాలై, పద్మవాసినియై, సమస్తలోకములకు స్వామినియైన వరదరాజస్వామి దేవేరియగు పెరుందేవి తాయార్లను సేవించు చున్నాను.) అని అనుసంథానము చేతురు.

ఇచట జరుగు బ్రహ్మోత్సవ వైభవము వర్ణనాతీతము. అందు మూడవనాడు ఉష:కాలమున (వేకువన) జరుగు గరుడసేవ సేవింపవలసినదేకాని చెప్పనలవికాదు. లోకములో కంచి గరుడసేవ యని ప్రసిద్ది. ప్రసిద్ద వాగ్గేయకారుడు శ్రీ త్యాగరాజస్వామి "వినతాసుత వాహనుడై వెడలె కాంచీవరదుడు" అని కంచి గరుడ సేవను కీర్తనగా రచించి ధన్యుడైనాడు. ఈగరుడసేవను సేవించుటకు దేశము నలుమూలల నుండి భక్తులు తండోప తండములుగా విచ్చేతురు. ఈ గరుడసేవను గూర్చిన శ్లోకము. <poem> శ్లో. కేచిత్ తత్త్వ విశోధనే పశుపతౌ సారమ్యమహం:పరే

 వ్యాజిహ్రం: కమలాసనే సయవిధా మన్యే హరిం సాదరమ్‌ |
 ఇత్యేవం చలచేతసాం కరధృతం పాదారవిందం హరే:
 తత్త్వం దర్శయతీవ సంప్రతిసృణాం తార్క్ష్య శ్శ్రుతీనాం విధి:||
 
 మణవాళమామునుల సన్నిధి సేవాక్రమము.

శ్లో. శ్రీమద్వారపరం మహద్ది బలిపీఠాగ్ర్యం ఫణీన్ద్ర హ్రదం

 గోపీనాం రమణం వరాహ వపుషం శ్రీభట్ట నాథం తథా
 శ్రీమస్తం శఠవైరిణిం కలిరిపుం శ్రీభక్తి సారం మునిం
 పూర్ణం లక్ష్మణ యోగినం మునివరా వాద్యావథ ద్వారపా||
 శ్రీమస్మజ్జన మణ్డపం సరసిజాం హేతీశభోగీశ్వరౌ
 రామం నీలమణిం మహానసవరం తార్స్యం నృసింహం ప్రభుమ్‌|
 సేనాన్యం కరిభూధరం తదుపరి శ్రీపుణ్య కోటిం తథా
 తస్మధ్యే వరదం రమాసహచరం వన్దే తదీయైర్వృతమ్‌||

శోభాయుక్తమైన పెద్ద గోపురద్వారమును; బలిపీఠమునకు ముందున్న

                        93