పుట:DivyaDesaPrakasika.djvu/161

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మార్గం: మద్రాస్-తిరుచ్చిరైలు మార్గంలో తిరుప్పాప్పు లియూర్ స్టేషన్ నుండి 5 కి.మీ. టౌన్ బస్ కలదు. మద్రాస్ నుండి మిగతా పట్టణముల నుండి "కడలూరు" బస్ గలదు. అక్కడ నుండి టౌన్ బస్ 5 కి.మీ.

పా. మిన్ను మాழிయజ్గై యవన్; శెయ్యవళుఱైతరు తిరుమార్వన్;
   పన్ను నాన్మఱైప్పల్ పొరుళాగియ; పరనిడమ్‌ వరై చ్చారల్;
   పిన్ను మాదవి ప్పన్దలిల్; పెడైవర ప్పిణియవిழ் కమలత్తు;
   తైన్న వెణ్ఱు వణ్డిన్నిశై ముఱల్‌తరు; తిరువయిన్దిరపురమే.
            తిరుమంగై ఆళ్వార్లు-పెరియ తిరుమొழி 3-1-2

73. తిరుక్కోవలూర్ 2

(గోపాలనగరమ్‌)

శ్లో. శ్రీమత్కృష్ణ సరోవరేణ కలితే శ్రీ కోవలూర్ పట్టణే
   భాతి శ్రీకర దేవయాన వసతి:పూంకోవలాఖ్యాం రమాం
   ప్రాగాస్య స్థితి రాయనారితి విభు: ప్రాప్తోమృకండోర్మునే:
   ప్రత్యక్షశ్చ బలే: సర: కలిరిపు శ్రీ భూతయోగి స్తుత:||

వివ: ఆయనార్(త్రివిక్రముడు)-పూంగోవల్ నాచ్చియార్-కృష్ణ పుష్కరిణి-శ్రీకర విమానము-తూర్పు ముఖము-నిలచున్న సేవ-మృకండుమహర్షికి, బలిచక్రవర్తికిని ప్రత్యక్షము. పొయిగై ఆళ్వార్-పూదత్తాళ్వార్-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: పంచకృష్ణారణ్య క్షేత్రములలో నొకటి. శ్రీకృష్ణుని నిత్యసాన్నిధ్యము కలక్షేత్రము. ముదలాళ్వార్లని ప్రఖ్యాతులైన పొయిగై ఆళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్ అను ముగ్గురు ఒకరి వెనుక ఒకరుగా ఈ దివ్యదేశమునకు వేంచేసి ఒక అరుగుపై నిలచుని యుండగా వీరి సంశ్లేషమును గోరిన పెరుమాళ్ళు వీరిమధ్యకు వచ్చి నిలచుండిరి. తమ మధ్య మరియెవరో నుండిరని భావించిన ఆళ్వార్లుకు పెరుమాళ్లు సేవ సాయింపగా ఆళ్వార్లు వరుసగా ముదల్ తిరువందాది, ఇరండాం తిరువందాది మూన్ఱాం తిరువందాదులు అను గ్రహించిన స్థలము. ముదలాళ్వార్లు మువ్వురు ఇటనే తిరునాడలంకరించిరి. ఇచట మూలవర్ త్రివిక్రమన్ కుడిపాదము పైకి ఎడమపాదము క్రిందకు గలదు. మరియు కుడిచేత శంఖము ఎడమచేత చక్రము ధరించియుందురు. మీనం-ఉత్తరా నక్షత్రం తీర్థోత్సవము-వృశ్చికమాసము కైశికి ఏకాదశి నాడు గొప్ప ఉత్సవం జరుగును. మరునాడు ద్వాదశి రోజున ఎంబెరుమానార్ జీయర్‌కు

                     89