బ్రహ్మరథోత్సవం జరుగును. ఈక్షేత్రస్వామి విషయమై వేదాంత దేశికులు దేహలీశస్తుతి యను స్తోత్రమును అనుగ్రహించిరి.
మార్గము: పుదుచ్చేరి-బెంగళూరు, చిత్తూర్-తిరుచ్చి (వయా) వేలూరు బస్ మార్గము. విల్లుపురం-కాట్పాడి రైలుమార్గము తిరుక్కోవలూర్ స్టేషన్. కడలూర్ నుండి బస్ వసతి గలదు. అన్ని వసతులు గలవు.
పా. తూవడివిల్ పార్ మగళ్ పూమజ్గైయోడు
శుడరాழி శజ్గిరుపాల్ పొలిన్దు తోన్ఱ,
క్కావడివిల్ కఱ్పగమే పోలనిన్ఱు
కలన్దవర్ గట్కరుళ్ పురియుమ్ కరుత్తి నానై;
చ్చేవడికై త్తిరువాయ్ కణ్ శివన్దవాడై
శెమ్బొన్‌శెయ్ తిరువురువ మానాన్ఱన్నై
త్తీవడివిల్ శివనయనే పోల్వార్ మన్ను
తిరుక్కోవలూర దనుళ్ కణ్డేన్ నానే.
తిరుమంగై ఆళ్వార్లు-పెరియ తిరుమొழி 2-10-9
తొండమండల తిరుపతులు
శ్లో. తుండీర మండలస్థావై దివ్యదేశా:శ్రియ:పతే:
వర్ణ్యంతే యతిరాజాంఘ్రి పంకజాశ్రయ వైభవాత్||
వివ: యతిరాజుల వారి శ్రీపాద పద్మములను ఆశ్రయించిన వైభవము వలన తొండ మండలమున గల దివ్యదేశములను వర్ణింతును.
మంచిమాట
విరోధులుభగవద్గుణానుభవమునకు విరోధి శబ్దాది విషయములందుగల ప్రీతి.
భగవత్కైంకర్యమునకు విరోధి ఇదినాదియను మమకారము.
సాధన విరోధి అజ్ఞానవశమున తానుకర్తను అని భావించుట.
ఈమూడు విరోధములకు కారణము అహంకారము.
కావున అహంకారమును విడచినచో విరోధులు నశింతురు.
"శ్రీ నంబిళై" 90