పా. ఆగుజ్కొల్ ఐయమొన్ఱిన్ఱి; యగలిడ ముత్‌తవుమ్ ఈరడియే
ఆగుమ్ పరిశు నిమిర్‌న్ద; తిరుక్కుఱళప్ప నమర్‌న్దుఱై యుమ్;
మాగమ్ తిగழ் కొడిమాడజ్గళ్; నీడుమదిళ్ తిరువాఱన్‌విళై
మాకన్ద నీర్ కొణ్డు తూవి వల--య్‌దు; కై తొழ క్కూడుజ్గొలో.
నమ్మాళ్వార్-తిరువాయిమొழி 7-10-2
శ్లో. ఇత్థం శ్రీమళయాళస్థ దివ్యదేశా స్త్రయోదశ|
మయా సంకీర్తితా శ్రీమత్ రామానుజ కృపాబలాత్||
వివ: భగవద్రామానుజులవారి కృపాబలము వలన మళయాళ దేశమున గల పదమూడు క్షేత్రములు వర్ణింపబడినవి.
శ్లో. అథద్వే మధ్య దేశస్థా వర్ణ్యతే క్షేత్ర సత్తమౌ|
రామానుజార్య కరుణా కటాక్ష బలతోమయా !
వివ: భగవద్రామానుజులవారి కరుణా కటాక్ష బలముచేత మధ్య దేశమున గల రెండు క్షేత్రరాజములు వర్ణింపబడుచున్నవి.
72. తిరువయిందిర పురమ్
శ్లో. శ్రీమత్ తార్ద్య తరజ్గిణీ తటతలే శేషాఖ్య తీర్థాంచితే
దేవ శ్శ్రీమదహేంద్ర పట్టణ వరే చంద్రాఖ్య వైమానగ:|
వైకుంఠాఖ్య రమాయుతో విజయతే శ్రీ దేవనాథ ప్రభు:
ప్రాగాస్య స్థితి రిందు తార్ద్య విషయ స్తుత్య: కలిద్వేషిణ:||
వివ: దెయ్‌వనాయకన్(దేవనాథన్)-వైకుంఠనాయకి(హేమాబ్జవల్లి)-గరుడనది-శేషపుష్కరిణి-చంద్రవిమానము-తూర్పు ముఖము-నిలచున్న సేవ-చంద్రునకు, గరుత్మంతునుకు ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.
విశే: శ్రీమత్ వేదాంత దేశికులు తపమాచరించిన ప్రదేశము. ఇచటనేవారు గరుడోపాసన చేసి వారి వలన హయగ్రీవుల యనుగ్రహము పొందుటకై హయగ్రీవ మంత్రమును పొందిరి. ఇచటగల కొండపై వారు ఆరాధించిన హయగ్రీవుల సన్నిధి కలదు. ఈ కొండకు ఔషధాద్రి యనిపేరు. ఈక్షేత్రమున శ్రీమద్వేదాంతదేశికులు నలుబది సంవత్సరములు వేంచేసియుండిరి. వారి తిరుమాళిగ (ఇల్లు) వారు స్వయముగా స్వహస్తములతో నిర్మించిన కిణర్ (నుయ్యి) ఇప్పటికిని గలవు.
ఈక్షేత్రస్వామి విషయమై శ్రీవేదాంత దేశికులు దేవనాయక పంచాశత్, అచ్యుతశతకం(ప్రాకృతభాష)-గరుడదండకం, గరుడ పంచాశత్, హయగ్రీవ స్తోత్రములను అనుగ్రహించిరి. ఇచట శ్రీమణవాళమహామునులకును సన్నిధి గలదు. మేషము-పౌర్ణమి తీర్థోత్సవము-కన్యాశ్రవణం వేదాంతదేశికుల తిరునక్షత్ర మహోత్సవం చాలా వైభవముగా జరుగును.
88