పుట:DivyaDesaPrakasika.djvu/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనునటుల నా హృదయమునందు వాసము చేయుచున్నాడు. అంతేకాక అందుకు కారణమైన తిరుక్కడిత్తాన క్షేత్రమున వేంచేసియున్నాడు. ఈ రెండును స్వామికి దాయప్రాప్తములుగదా!" అని ఆళ్వార్లు సర్వేశ్వరుని కృతజ్ఞతా గుణమును ప్రకాశింపజేసిరి. ఈ క్షేత్రము సహదేవునిచే ప్రతిష్ఠింపబడినట్లు చెప్పుదురు. చిన్న గ్రామము. సమీపమందలి శెంగనాంచేరిలో మకాంచేయవలెను. లేక తిరువల్లవాழ் నుండి పోవచ్చును.

పా. తాన నగర్ గళ్; తలైచ్చిఱన్దెజ్గెజ్గుమ్;
   వానిన్నిలమ్‌ కడల్; ముత్‌త్తు మెమ్మాయఱ్కే;
   ఆనవిడత్తు; మెన్నై--మ్‌ తిరుక్కడిత్
   తాననగరుమ్; తన తాయప్పదియే.
         నమ్మాళ్వారు-తిరువాయిమొழி 8-6-8

71. తిరువాఱన్ విళై 13 (ఆరుముళై)

శ్లో. తిరువారన్ విళాఖ్యానే పురేవ్యాస స్పర స్తటే|
   కురళప్పవితి శ్రీమాన్ పద్మాసన రమాపతి:||
   విమానం వామనం ప్రాప్త: కుబేర హరి దానన:|
   బ్రహ్మేక్షితస్థితో రేజే పరాంకుశ మునిస్తుతు:||

వివ: తిరుక్కుఱళప్పన్-పద్మాసనవల్లి త్తాయార్-వ్యాస పుష్కరిణి-వామన విమానము-ఉత్తర ముఖము-నిలచున్నసేవ-బ్రహ్మకు ప్రత్యక్షము-నమ్మాళ్వార్ కీర్తించినది.

విశే: ఈ క్షేత్రము అర్జునునిచే ప్రతిష్ఠింపబడినట్లు చెప్పుదురు. ఇచట మూలవరులకు ప్రతి నిత్యము తిరుమంజనము, పుష్పాలంకరణము కలదు. తప్పక సేవింపదగినది. నమ్మాళ్వారు తిరువాయిమొழி ఏడవశతకం పదవ దశకమగు "ఇన్బం పయక్క" అను తిరువాయిమొழிలో "ఇన్బమ్ పయక్క ఇవితుడన్‌వీత్తిరున్దు" (సుఖము కలుగునట్లుగా ప్రీతితో వేంచేసియుండి) అని సమస్త లోకములకు స్వామియగు సర్వేశ్వరుడు పిరాట్టితో (శ్రీదేవి) పాటు నా తిరువాయిమొழி వినుటకై తిరువాఱన్‌విళై క్షేత్రమున వేంచేసియున్నాడు." అని సర్వేశ్వరుని ఆనందాతిశయము అను గుణమును ప్రకాశింపజేసిరి. ఈ క్షేత్రమునకు "వీణగర్"(మహానగరము) అను తిరునామము కలదు. తి.వా.మొ. 7-10-6

మార్గము: శెంగణూర్‌కు తూర్పున 10 కి.మీ. సత్రము కలదు. వసతులు స్వల్పము.

                                            87