పుట:DivyaDesaPrakasika.djvu/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అమరరాయ్‌త్తిరిగిన్ఱార్గట్కుఆది" అనుటచే బ్రహ్మాది దేవతలు సేవించుటను; "అమరర్‌కోన్ అర్చిక్కిన్ఱ అజ్గగప్పణి శెయ్యర్" "సేన ముదలియాళ్వార్(విష్వక్సేసులు) ఆరాధింపగా అందుకు తగినట్లు అంతరంగ కైంకర్యనిరతులును నిత్యముక్తులును, అనుటచే సైన్యాధిపతి సేవించుటయు "నమర్గళో శొల్లక్కేణ్మిన్ నాముమ్‌ పోయ్ వణుగ వేణ్డుమ్" "భాగవతులారా! నామాట వినుడు మనము తిరువనంతపురము పోయి కైంకర్యము చేయవలెను" అనుటచే మన వంటి వారి సేవను స్వీకరించు చున్నాడు.

ఈవిధముగా ఏవిధమైన తారతమ్యము లేక సర్వుల సేవను స్వీకరించుటచే సామ్యమను గుణము ప్రకాశించుచున్నది.

మార్గము: ఇది కేరళ రాష్ట్ర రాజధాని. చెన్నై-తిరువనంతపురం(త్రివేండ్రం)రైలు మార్గము. తిరువనంతపురము సెంట్రల్ స్టేషన్ నుండి 1 కి.మీ.

పా. కెడుమిడరాయ వెల్లామ్; కేశవా వెన్న; నాళుం
    కొడువివై శెయ్యుమ్‌ కు త్‌తిన్; తమర్ గళుమ్‌ కురుగ కిల్లార్;
    విడముడై యరవిల్ పళ్ళి; విరుమ్బినాన్ శురమ్బలత్‌తుమ్;
    తడముడైవయ; లనన్ద పురనగర్ పుగుదు మిన్ఱే.

    కడువినై కళై యలాగుమ్; కామనై ప్పయన్ద కాళై;
    ఇడవగై కొణ్డదెన్బర్;ఎழிలణి యనన్దపురమ్;
    తడముడై యరవిల్ పళ్ళి; పయిన్ఱవన్ పాదం కాణ
    నడమినో నమర్గళుళ్ళీర్; నాముమక్కఱుయచ్చొన్నోమ్;
           నమ్మాళ్వార్-తిరువాయిమొழி 10-2-1,8


మంచిమాట

జీవులు

నిత్యవిభూతియగు పరమపదము లీలావిభూతి యీ రెండును సర్వేశ్వరునకు శేషభూతమై యుండును. వీనిలోనివసించువారు నిత్యులనియు ముక్తులనియు బద్ధులనియు మూడు విధములుగా నుందురు. అందు నిత్యులనగా అనంత గరుడ విష్వక్సేనాధి అంతరంగిక కైంకర్యవరులు. ముక్తులనగా కొంతకాలము సంసారమున పడియుండియు సర్వేశ్వరుని కృపకు పాత్రులై పరమపదమును చేరినవారు. బద్ధులనగా సంసారమున బడియుండువారు. వీరు రెండు విధములుగా నుందురు. 1. ఋబుక్షువులు 2. ముముక్షువులు. బుభుక్షువులనగా అవిధ్యకు వశ్యులై దేహయాత్రచేయువారు. ముముక్షువులనగా సుకృతవశమున ఆచార్యానుగ్రహము లభింపక సర్వేశ్వరుని పొందుటకై ప్రయత్నించువారు.

76