Jump to content

పుట:DivyaDesaPrakasika.djvu/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీలమేఘ శ్యామలమైన తిరుమేనియు చతుర్బుజములు గలిగి నామనస్సున నిండియున్నాడు." అనునట్లుగా విభవావతార లావణ్యమును అర్చావతారమందు దర్శించిరి.

సూచన: ఇచట ఎంబెరుమానార్లు స్వామికి మంత్రోపదేశము చేయుటచే అన్ని దివ్య దేశములలో వలె అంజలి ముద్రతో గాక జ్ఞానముద్రతో వేంచేసియుందురు. తిరుమంగై ఆళ్వార్ శ్రీరంగనాథుని యాజ్ఞానుసారము తిరునాడలంకరించిన ప్రదేశమును వారిని తిరుప్పళ్లి చేర్చిన స్థలమును ఇచట సేవింపవచ్చును.

మార్గము: నాజ్గునేరి(వానమామలై) నుండి 15 కి.మీ దూరములో గలదు. బస్‌వసతి కలదు. నాంగునేరి నుండి కళక్కాడు పోయి అటనుండి వేరు బస్‌లో తిరుక్కురుజ్గుడి చేరవచ్చును. రామానుజకూటము, జీయర్‌స్వాముల మఠము కలవు. మితమైన సౌకర్యములు గలవు.

పా. నిఱైన్ద వన్బழி నజ్కుడిక్కివళెన్ఱు; అన్నై కాణ కొడాళ్;
    శిఱన్ద కీర్తి త్తిరుక్కురుజ్గుడి నమ్బియై; నాన్ కణ్డ పిన్;
    నిఱైన్దశోతి వెళ్ళమ్‌ శూழ்న్ద; నీణ్డ పొన్మేని యొడుమ్;
    నిఱైన్దెన్నుళ్లే నిన్నొழிన్దాన్; నేమియజ్గై యుళతే.
             నమ్మాళ్వార్-తిరువాయిమొழி 5-5-7


మంచిమాట

"ఆవిద్య"

        అనాత్మన్యాత్మ బుద్ధి ర్వా అస్వేస్వమితి యామతి:
        అవిద్యా తరు సంభూతి:బీజమేతత్‌ద్విథా స్థితమ్‌||

అవిద్య అనునది యొక వృక్షము.
ఈ వృక్షమునకు పుట్టిన బీజములు రెండు
1. ఆత్మకాని దేహేంద్రియాదులను ఆత్మ అని భావించుట.(అహంకారము)
2. తనదికాని ఆత్మను తనదియని తలంచుట (మమకారము) సంసారులగు చేతనులు ఈ అవిద్యతో కూడియుందురు. ఈఅవిద్య వలన దేవతిర్యక్ మనుష్య స్థావరములను నాల్గు విధములైన జన్మలు కలుగును. కావున ప్రాజ్ఞుడైనవాడు అవిద్యను పారద్రోలవలెను. అనగా అహంకార మమకారములను విడచిపెట్టవలెను.