Jump to content

పుట:DivyaDesaPrakasika.djvu/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

57. తిరుక్కురుంగుడి 17

శ్లో. శ్రీక్షీరాబ్ది తరజ్గిణీ తటతలే పూర్ణాహ్వయ శ్రీ పతి:|
    దివ్యే భాతి తిరుక్కురుజ్గుడి పురే పంచాకృతి ద్యోతిత:|
    సంప్రాప్త శ్శుభ పంచకేతిక పదం వైమాన మైంద్రీముఖ
    స్థాయీ సాక్షి పదం కురుజ్గుడి లతానాథ శ్శఠారి స్తుత:||

శ్లో. శ్రీ మద్విష్ణు మన శ్శ్రీమత్పర కాల వచ:ప్రియ:|
   రామానుజార్య మునిపాత్కృతో భయ విభూతిక:

వివ: వైష్ణవ నంబి. మలైమేల్ నంబి; నిన్ఱ నంబి, ఇరుంద నంబి; కిడంద నంబి, తిరుప్పార్‌కడల్ నంబి అను పంచాకృతులలో వేంచేసియున్నారు. కురుంగుడి వల్లి తాయార్; తిరుప్పార్ కడల్ నది; పంచకేతక విమానము; తూర్పు ముఖము, నిలుచున్న సేవ, పరమ శివునకు ప్రత్యక్షము, నమ్మాళ్వార్, పెరియాళ్వార్, తిరుమழிశై ఆళ్వార్, తిరుమంగై యాళ్వార్ కీర్తించినది. ఉడయవరులకు ఉభయ విభూతి నాయకత్వమును అనుగ్రహించిన స్థలము.

విశే: ఈ క్షేత్రమునకు వైష్ణవ వామనమని పేరు. ఇచట స్వామి వడుగ నంబి రూపముతో ఉడయవరులను (శ్రీరామానుజులను) ఆశ్రయించి వారి నుండి మంత్రోపదేశమును పొంది సకల వేదాన్తార్థములను గ్రహించి "మేమును శ్రీభగవద్రామానుజులను ఆశ్రయించితిమి; దన్యులమైతి" మని ఆనందముతో ప్రకటించుటచే ఈ క్షేత్రమునకు వైష్ణవ వామనమని పేరు. ఈ ఉత్సవము ప్రతి సంవత్సరము మిధునమాసములో జరుగును. వామనుడు వసించిన చోటగుటచే కురుజ్గుడి యనియు సిద్దాశ్రమమనియు పేరు వచ్చెను. ఉడయవర్ తడివస్త్రములను ఆరబెట్టిన "తిరువట్టప్పారై" ఇచట సేవింపవచ్చును. ఇచట ఉడయవర్ అంజలి ముద్రతో కాక జ్ఞాన ముద్రతో వేంచేసియుందురు. నిన్ఱ-కిడంద నంబుల సన్నిధుల మధ్య శివుని ఆలయము కలదు.

ఈ సన్నిధికి 10 కి.మీ దూరములో కొండమీద మలైమేల్ నంబి సన్నిధి గలదు. ఈ దివ్యదేశమున తాయార్; పెరుమాళ్లతో కలసి వేంచేసియుందురు. మీనం ఉత్తర తీర్థోత్సవము.

ఈ క్షేత్రమును గూర్చి ఆళ్వార్లు "విఱైన్ద శోతి వెళ్లమ్‌ శూழ்న్ద; నీణ్డ పొన్మేని యోడుమ్‌, విఱైన్దెన్నుళ్లే నిన్ఱొழிన్దాన్" "పరిపూర్ణమైన కాన్తి ప్రవాహముచే పరీవృతమై స్పృహణీయమైన దివ్య మంగళ విగ్రహముతో స్వామి నా హృదయమున వేంచేసి యున్నాడు." అనియు "నీలమేనియుమ్ నాన్గు తోళుమ్‌ ఎన్నెంజం నిఱైన్దనవే"