పుట:DivyaDesaPrakasika.djvu/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56. తిరుక్కుళందై 16 (తెన్‌కుళన్దై)

(పెరుంకొళమ్‌)

శ్లో. శ్రీమత్కుళంద నగరేతు పెరుంకొళాఖ్య
   తీర్థే కుళంద లతికా నయనాబ్జ భృజ్గ:|
   ప్రాగాసన స్థితి రసౌ గురుసేవితాంగ
   శ్రీమత్పరాజ్కుశ మునీంద్ర పరిస్తుతాత్మా||

శ్లో. ఆనంద నిలయాఖ్యాస విమానస్థో మహీయతే|
   మాయానట విభుర్భక్త పరిరక్షణ దీక్షిత:||

వివ: మాయక్కూత్తన్-కుళందవల్లి తాయార్-పెరుంకుళ తీర్థం-ఆనందనిలయ విమానము-తూర్పు ముఖము-నిలుచున్నసేవ-బృహస్పతికి ప్రత్యక్షము-నమ్మాళ్వార్ కీర్తించినది.

విశే: ఇచ్చట పెరుమాళ్ల ప్రక్కగా పెరియ తిరువడి (గరుత్మంతులు) వేంచేసియున్నారు. "అత్యంత ప్రీతితో తనను జేరిన వారి స్త్రీ సహజ ధర్మములను పోగొట్టి తన అద్బుత ఆశ్చర్య చేష్టిత గుణములను ప్రకాశింపజేసిన స్వామి" యని "పల్ వళై యార్ మున్ పరిశழிన్దేన్, అను పాశురమున (తిరువాయి మొழி 8-2-4)నమ్మాళ్వార్ భగవంతుని అద్భుత చేష్టిత గుణమును ప్రకాశింపజేసిరి.

సూచన: ఇచటి అర్చకస్వాములు తొలవిల్లి మజ్గలం క్షేత్రమునకు పోవుదురు. వారుండు సమయమును ముందుగా తెలిసికొని సేవింపవలెను.

మార్గము: ఈక్షేత్రమును పెరుజ్కొళమనియే చెప్పవలెను. తిరుప్పుళిజ్గుడి నుండియు, శ్రీవైకుంఠము నుండియు పోయి సేవింపవచ్చును. ఆక్షేత్రములకు 10 కి.మీ. దూరములో గలదు.

పా. కూడచ్చెన్ఱే నినియెన్ కొడుక్కేన్;కోల్వళై నె--త్తుడక్కు మెల్లామ్‌;
    పాడత్తొழிయ విళై న్డువైగల్;పల్వళై యార్ మున్ పరిశழிన్దేన్,
    మాడక్కొడి మదిళ్ తెన్ కుళన్దై; వణ్ కుడపాల్ నిన్ఱమాయ క్కూత్తన్;
    ఆడల్ పఱవై యుయర్‌త్త వెల్పో; రాழிపలవనై యాదరిత్తే.||
          నమ్మాళ్వార్-తిరువాయిమొழி 8-2-4.


మంచిమాట

ఈ ఆత్మకు సర్వేశ్వరుడు కట్టిన మంగళసూత్రమే తిరుమంత్రము.

"పిళ్లై తిరునరయూర్ అరయర్"