Jump to content

పుట:DivyaDesaPrakasika.djvu/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చూచితిరా! స్వామీ! మీరు ఆ గోష్ఠిలో చేరినను మీరు మీ సంస్కృతమును వదలక పోతిరి. కావున మనమేగోష్ఠిలో చేరినను మనము మనమే వారు వారే!అని పలికిరట.

మార్గము: ఇది ఆళ్వార్ తిరునగరి నవతిరుపతులలో నొకటి. తిరువరగుణమజ్గై క్షేత్రము నుండి 1 కి.మీ దూరములో గలదు.

పా. పణ్డైనాళాలే నిన్ఱిరు వరుళుమ్; పజ్గయత్తాళ్ తిరువరుళుమ్‌
    కొణ్డు; నిన్ కోయిల్‌శీయ్‌త్తు ప్పల్ పడికాల్;కుడి కుడి వழி వన్దాట్బెయ్యుమ్‌
    తొణ్డరోర్‌క్కరుళి చ్చోతివాయ్ తిఱన్దున్; తామరై క్కణ్గళాల్ నోక్కాయ్;
    తెణ్డిరై ప్పొరునల్ తణ్ పణై శూழ்న్ద; తిరుప్పుళిజ్కుడిక్కిడన్దానే.
                నమ్మాళ్వార్-తిరువాయిమొழி 9-2-1

53. తెన్ తిరుప్పేర్ 13 (తిరుప్పేరై)

శ్లో. శ్రీతెన్ తిరుప్పేర పురేతు శుక్ర సరస్సు రమ్యే సురదిజ్ముఖాసన:|
   శ్రీమత్కుழைకోద లతాదినాథో విరించి నేశానగ విప్ర సేవిత:||
   మకరాయత కర్ణ భూషణ శ్బుభ భద్రాఖ్య విమాన మాశ్రిత:
   శఠవైరి మహర్షిణాస్తుతో భువి భక్తేష్టకృతే విరాజితే||

వివ: మకరనెడుం కుழைక్కాద ప్పెరుమాళ్-నిగరిల్ ముకిల్ వణ్ణన్-కుழைకోదై వల్లి తాయార్-శుక్ర పుష్కరిణి-భద్ర విమానము-తూర్పు ముఖము-కూర్చున్న సేవ-బ్రహ్మ, శివ, శుక్రులకు ప్రత్యక్షము-నమ్మాళ్వార్లు కీర్తించినది.

విశే: ఈ దివ్యదేశమునకు "మానగర్"(మహానగరము తి.మొ.7-3-9) అను విలక్షణమైన తిరునామము కలదు. నమ్మాళ్వార్ తిరువాయి మొழிలో "వెళ్లచ్చురిశజ్డొడు" అను దశమున "శెజ్గనివాయిన్(ఎఱ్ఱని పండు వంటి అధరము) అను పాశురమున ఓసఖీ! తిరుప్పేరై దివ్యదేశమున వేంచేసియున్న స్వామి ఎఱ్ఱని పండువంటి అధరమును తేజోవంతమైన కిరీటమును, శంఖ చక్రాది ఆయుధములను ధరించి నామనస్సును వశపరచుకొనినాడు" అని సర్వేశ్వరుని సౌందర్యమును సేవించి ప్రకాశింపజేసినారు. మీనం ఉత్తర తీర్థోత్సవము.

మార్గము: ఈక్షేత్రమునకు తిరుప్పొరై యని వాడుకపేరు. తిరునల్వేలి తిరుచున్దూర్ రైలు మార్గములో ఆళ్వార్ తిరునగరి నుండి 5 కి.మీ. సత్రము కలదు. వసతులు స్వల్పము.

పా. శెజ్గని వాయిన్ తిఱత్తదాయుమ్;శె--డర్‌నీణ్‌ముడి త్తాழ்న్ద దాయుమ్;
    శజ్గొడు శక్కరమ్‌ కణ్డుగన్దుమ్;తామరై క్కణ్ కళు క్కత్‌త్తు త్తీర్‌న్దుమ్;
    తిజ్గళునాళుమ్‌ విழாవఱాద; తెన్ తిరుప్పేరైయిల్ వీత్తిరిన్ద;
    నజ్గళ్ పిరాను క్కెన్నె--న్దోழி!;నాణు నిఱై యు మిழన్దదువే.||
              నమ్మాళ్వార్-తిరువాయిమొழி 7-3-3

                                           68