52 తిరుప్పుళింగుడి 12
శ్లో. శ్రీమత్కాశిన వేందవాహ్వయ విభు స్తీర్థాంచితే నిర్‌ఋతే:
ప్రాచీ వక్త్రయుత: పుళిజ్గుడి పురే భోగీంద్ర భోగశయ:|
నాయక్యా తు మలర్ మకళ్ పదయుజా శ్రీ వేద సారంగతో
వమాసం వరుణాశరాతిధి వపూ రేజే శఠారి స్తుత:||
వివ: కాయశిన వేందన్-మలర్‌మకళ్ తాయార్(పుళిజ్గుడి వల్లి)-వరుణ తీర్థము-నిర్‌ఋతి తీర్థము-వేదసార విమానము-తూర్పు ముఖము-భుజజ్గ శయనము-వరుణ నిర్‌ఋతులకు ప్రత్యక్షం-నమ్మాళ్వార్ కీర్తించినది.
నమ్మాళ్వార్ "వణ్డనాళాల్" అను తిరువాయిమొழிలో (9-2-4) "పుళిజ్గుడిక్కిడన్దు" (తిరుప్పుళిజ్గుడిలో వేంచేసి యుండి) యని సర్వేశ్వరుని "భోగ్యపాక త్వర" అను గుణమును ప్రకాశింపజేసిరి. ఈక్షేత్రమునకు "తెళిన్దశిన్దెక్కు మున్నిల్ మూన్ఱు" (నిర్మలమైన హృదయములో ప్రకాశించిన స్వామిగల దివ్యదేశములు మూడు 9-2-4) అను విలక్షణ తిరునామము కలదు. మిగిలిన రెండు క్షేత్రములు వరగుణమజ్గై, శ్రీవైకుంఠము. ఇంద్రునకు బ్రహ్మహత్యాదోషము పోగొట్టిన స్థలము.
స్వామి తిరుప్పుళిజ్గుడిలో శయనించియున్నాడు. శ్రీవైకుంఠములో నిలచియున్నాడు. ఆళ్వార్లు స్వామిని "స్వామీ!ఒక్కమారైనను సుఖాసీనుడవై దర్శనమును అనుగ్రహింపుము. సంసారులందరు నీపాదములపై బడి నిన్ను స్తోత్రము చేయుదురు. ఆ కమనీయ దృశ్యమును సేవింప నాశగానున్నది" యని ప్రార్థించిరి. ఇచట నొక ఐతిహ్యము కలదు.
ఒకనాడు పెరుమాళ్ల సన్నిధిలో శ్రీవైష్ణవులు ఒక వైపున గొల్లవాండ్రు ఒకవైపున నిలచి పెరుమాళ్లను సేవించుచుండగా "వంగి పురత్తునంబి" అనువారు శ్రీవైష్ణవ గోష్ఠిని వీడి గొల్లల పంక్తిని చేరిరట. దీనిని చూచిన "ముదలి యాండాన్" "ఇట్లేల చేసితిరి?" అని అడుగగా ఎట్లైనను మనకు అభిమానము, అభిజినాహంకారము ఉండియే తీరును. గొల్లవాండ్ర కవి లేవు. కావున పెరుమాళ్ల దృష్టి వారితోపాటు నామీద కూడ పడునని నిలచితిని. సర్వేశ్వరుని దృష్టి మనమీద పడుట నీరు మెరకకు ప్రవహించుట వలె కష్టము. వీరిపై పడుట నీరు పల్లమునకు ప్రవహించుట వలె సుకరము కదా!" యని యనిరి.
పిమ్మట ముదలియాండాన్ "స్వామీ! గొల్లలు సర్వేశ్వరుని ఏమని స్తుతించిరి? "యని యడుగ" నూరేళ్లు వర్దిల్లుము; సిరి సంపదలతో తులతూగుము అని స్తుతించిరని చెప్పిరి. "దేవరవారు ఏమని స్తుతించిరి?" అని ప్రశ్నింపగా "విజయీభవ!విజయీభవ! అని పలికితిని అనిరట. అంత ముదలియాండాన్
67