54. శ్రీ వైకుంఠము 14
శ్లో. శ్రీవైకుంఠపురే పృథోస్తు సరసా శ్రీ తామ్రపర్ణీ తటే
యుక్తే చంద్ర విమాన మధ్యనిలయో వైకుంఠ నాథ: ప్రభు:|
ప్రాగాస్య స్థితి రాశ్రిత:ప్రియతమాం వైకుంఠ వల్లీం ముదా
భాతి శ్రీ పృథురాజ శక్ర నయనా గంతు శ్శఠారి స్తుత:||
వివ: వైకుంఠనాథ పెరుమాళ్(కళ్ళపిరాన్)-వైకుంఠవల్లి-పృథు తీర్థము-తామ్రపర్ణీనది-చంద్ర విమానము-తూర్పు ముఖము-నిలచున్న సేవ-పృథు చక్రవర్తికి, ఇంద్రునకు ప్రత్యక్షము. నమ్మాళ్వార్ కీర్తించినది.
నమ్మాళ్వార్లు "పణ్డనాళాలే" అను దశకమున(9-2)"పుళిజ్గుడిక్కిడన్దు వరగుణ మజ్గైయిరన్దు వైకున్దత్తుళ్ నిన్ఱు" అను తావున(తిరుప్పుళిజ్గుడిలో శయనించి యుండుట;వరగుణమజ్గై యను క్షేత్రమున కూర్చుని యుండుట;శ్రీవైకుంఠమున నిలచి యుండుటలో చేతనులమగు మనలను పొందుటకై సర్వేశ్వరుడుపడు తొందరను ప్రస్తుతించి సర్వేశ్వరుని "భోగ్యపాకత్వర" యను గుణమును ప్రకాశింపజేసిరి.
సూచన: ఈక్షేత్రమునకు 5 కి.మీ. తూర్పున ఆళ్వారు తిరునగరి, 1.కి.మీ దూరమున వరగుణమజ్గై, తిరుప్పుళిజ్గుడి క్షేత్రములు కలవు.
మార్గము: తిరునెల్వేలి-తిరుచ్చందూరు రైలు మార్గములో శ్రీవైకుంఠం స్టేషన్ నుండి 2 కి.మీ దూరములో సన్నిధి కలదు.
పా. ఎజ్గళ్ కణ్ ముగప్పే యులగర్ గళెల్లా; మిణై యడితొழுదెழு దిఱై--;
తజ్గళన్బారత్తముదు శొల్వలత్తాల్;తలై త్తలైచ్చిఱన్దు పూశిప్ప;
తిజ్గళ్‌శేర్ మాడ త్తిరుప్పుళిజ్గుడియాయ్;తిరువైకున్దత్తుళ్ళాయ్ తేవా;
ఎజ్గళ్ మా--లత్తిదనుళు మొరునాళిరు న్దిడాయ్;వీత్‌త్తిడజ్కొణ్డే.
నమ్మాళ్వార్-తిరువాయి మొழி 9-2-8
మంచిమాట
అహంకారము అనునది ఒక సర్పము-మమత దానికి శరీరము.
రాగద్వేషములు ఆసర్పముయొక్క దంతములు.
దంతములను తీసివేసినచో ఆసర్పము నశించును.
అనగా రాగద్వేషములను విడచిపెట్టినచో
అహంకారము నశించునని తాత్పర్యము.
69