Jump to content

పుట:DivyaDesaPrakasika.djvu/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు

శ్రీమతే రామానుజాయ నమ:

ఆముఖము

ఉ||వే శ్రీమాన్

కె.యస్.రామానుజాచార్యులు యం.ఎ.

అధ్యక్షులు. ఉభయవేదాంత సభ.

రిటైర్డ్ ప్రిన్సిపాల్.నెల్లూరు.

'ఆళ్వార్‌' అనగా భక్తి పరవశుడని యర్థము. వీరు పదిమంది యని ప్రసిద్ది "ఉపదేశరత్తినై మాలై" లో మణవాళమామునులు

పా| పొయ్‌గై యార్, పూదత్తార్, పేయార్, పుగళ్ మழிశై అయ్య, నరుల్ మాఱన్, శేరలర్‌కోన్, తుయ్య భట్టనాదన్, అన్బర్‌తాళ్ తూళి, నఱ్పాణన్, నన్ కలియన్ ఈతివర్ తోత్తతడై వా మింగు. అను పాశురమునందు వీరిని అవతార క్రమానుసారం పేర్కొన్నారు. వీరికి దివ్యసూరులు అని నామాన్తరము.

వీరి నామదేయములు

తమిళమున__________________________సంస్కృతమున

1. పొయ్‌గై యాళ్వార్____________________సరోయోగి

2. పూదత్తాళ్వార్_______________________భూతయోగి

3. పేయాళ్వార్_________________________మహాయోగి

4. తిరుమழிశైప్పిరాన్___________________భక్తిసారయోగి

5. నమ్మాళ్వార్________________________శఠకోపముని

6. కులశేఖర ప్పెరుమాళ్_________________కులశేఖరులు

7. పెరియాళ్వార్_______________________భట్టనాధముని

8. తొండరడిప్పొడియాళ్వార్________________భక్తాంఘ్రిరేణుముని

9. తిరుప్పాణాళ్వార్_____________________మునివాహనసూరి

10. తిరుమంగై యాళ్వార్_________________పరకాలయోగి

ఈ పది మంది దివ్యసూరులతో బాటు మధురకవిని శ్రీగోదాదేవిని చేర్చినచో ద్వాదశ దివ్యసూరులగు చున్నారు.

వీరు అనుగ్రహించిన దివ్యప్రబన్దములు