పుట:DivyaDesaPrakasika.djvu/10

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
శ్రీరస్తు

దివ్యదేశ అష్టోత్తర శతనామ స్తోత్రమ్‌

శ్రీమాన్ శ్రీరంగనాథ శ్శ్రీ నిచుళాపుర నాయకః
నీలమేఘః సుందరశ్చ కదంబ వరదో హరిః

శ్రీరామః పుండరీకాక్షః రసాపూపప్రద స్తథా
భుజంగశయనో దేవరాజో నారాయణాత్మకః

హరశాపహార స్సారనాథో రక్తాబ్జ నాయకః
శార్జ్గపాణిః శ్రీనివాసః శౌరిః సౌందర్యనాయకః

పూర్ణః సుందర జామాతా నాథ నాథః త్రివిక్రమః
గోవిందరాజ స్సౌగంధ్య వననాథో జగత్పతిః

గజేంద్ర వరదోదేవః శ్యామళో భక్తవత్సలః
శృంగార సుందరో నన్దప్రదీపశ్చ పరాత్పరః

వైకుంఠనాధో దేవానాం నాయకః పురుషోత్తమః
కృపావాన్ రక్త పద్మాక్షః రత్నకూటాధినాయకః

శ్రీమన్నారాయణః కృష్ణః కమలాపతి సుందరః
సౌమ్యనారాయణ స్సత్యగిరినాథో జగత్పతిః

పితా శ్రీకాలమేఘశ్చ సుందర స్సుందరో హరిః
రంగమాన్నారా దినాథో పద్మాక్షో దేవనాయకః

దేవాది నాయక శ్శ్రీమాన్ శ్రీమత్కాయ్‌శిన భూపతిః
మకరాయతకర్ణ శ్రీః వైకుంఠో విజయాసనః

మాయానటో మహాపూర్ణః నిక్షిప్తనిధి నాయకః
అనంతశయన శ్రీమత్ వక్షోః వాత్సల్య నాయకః