పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిది. అప్పుడు మాణిక్యరావువారు పాతృనివారు అలవర్తివార్ల అధికారములోనికి వచ్చినది. తరువాత కొండవీటిసీమ 3 వంతులుగా చేయగా ఈ గ్రామం రమణయ్య మాణిక్యరావు వారికి అప్పచెప్పగా వారు ప్రభుత్వంచేసి 1127౧లో సీతన్న మాణిక్యరాయలంగారు ప్రభుత్వానికి వచ్చి అచ్చన్నగారికి కు 080 మాన్యం ఇప్పించినారు. వీరి అన్నదమ్ములు ఆరుగురు క్రమేణ ప్రభుత్వం చేసి గోపాలమాణిక్యరాయలంగారు 1168 వరకు ప్రభుత్వం చేసిరి. వీరి కుమారులు సీతన్నగారి కుమారులు జంగన్నగారు ప్రభుత్వానికి వచ్చి 130 కుచ్చెళ్ల యీనాములు ఇప్పించిరి. 1201 వరకు ప్రభుత్వం చేసిరి. వీరి కుమారులు భావయ్య మాణిక్యరాయలంగారు 1202లో రాజ్యంకు వచ్చి 1122 ఫసలీవరకు ప్రభుత్వం చేస్తూవున్నారు. గ్రామంగుడికట్టు కుచ్చళ్లు 1754

(4) పూండ్ల :— పొన్నూరు తాలూకాలోని రేపల్లెలోని రాజా భావయ్యమాణిక్యరావు సర్కారులోని 1222 ఫసలీ; 1201 నుంచి గ్రామం గుడికట్టు 122 కుచ్చళ్లు.

(5) ఇనగర్తిపాడు :—— పొన్నూరుసంతు రేపల్లె తాలూకా పైమాదిరిగా పరిపాలనలు జరిగెను. ఈ గ్రామం విష్ణువర్థనుడు పరిపాలనలో చెఱుకూరు త్రివిక్రమస్వామివారికి అగ్రహారం యిచ్చినారు గ్రామం గుడికట్టు కుచ్చళ్లు 13.

(6) నుదురుమాడు ఖండ్రిక :— ఈఖండ్రికలో 5 గ్రామాదు లున్నవి ఒకప్పుడు ఈ 5 గ్రామాదులలోని రుసుము మాణిక్యరావు వసూలు చేయుచుండిరి. (7) మండూరు :— కూచిపూడి సర్కారు ముర్తున్నజాగరు రాచూరు తాలూకే:

ఇక్కడ మాండవ్యమహాముని కొంతకాలం తపస్సు చేసిన చోటు. ఇక్కడ శివలింగం ప్రతిష్టించిరి. దీనికి మాండలేశ్వరస్యామి అని పేరు. దీనికి దక్షిణభాగమందు వేణుగోపాలస్వామివారిని ప్రతిష్టించిరి. ఇది అరణ్యము మునీశ్వరులే ఈ దేవాలయములను పూజించుచుండిరి.