పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1122లో కొండసీమ 14 వంత్లు చేసి పంచిపెట్టుటలో ఈగ్రామం బరభద్ర పాతృని అప్పన వంతు వచ్చెను. ఈయన 170 కుచ్చిళ్లు శ్రీస్వామివార్లకు యిచ్చి వుత్సవము యేర్పాటు చేసిరి. ఈయన తదనంతరం ఈయన కుమార్డు పాపన్న రాజ్యపాలన చేయుచుండగా మాణిక్యారావువారు బలవంతముగా ఆక్రమించి వొలివేరు యెడ్లపల్లి మండూరు చినగాదెలవఱ్ఱు అంగలకుదురు కొండపాడు వగైరాగ్రామాదులు పాతృనివారి మనోవర్తిక్రింద వుంచిరి.

1211లో రాచూరు తాలూక వేలం వేయబడుటవల్ల ఈగ్రామం మల్రాజు వెంకటగుండారాయునింగారు కొనిరి గ్రామంగుడికట్టుకు 60.

చినగాదెల వర్కు కూచిపూడి తాలూకా రాచూరు సర్కారు ఇదిమండూరుకు వాయవ్యమూల వున్న ఒక దిబ్బ, ఈప్రదేశ మందు మండూరు ప్రజలు చిన్న గాదెలు కట్టుకొని ధాన్యం నిలవ చేసుకొంటూ వచ్చి క్రమేణ రయితులు నివసించుట వల్ల చినగాగాదెలవఱ్ఱు గ్రామమయినది. ఇది బలభద్రపాతృనివారిది. రాచూరు మాణిక్యరావువారు జయించి బలభదృపాతృని వారికి మనోవర్తి క్రింద వుంచిన 45 గ్రామాదులలో యిది ఒకటి. మాణిక్యారావు జంగన్నరావు తిరుపతిరాయంగార్లు ఆయన అన్నదమ్ములు భాగం పంచుకొనుటలో ఇది తిరుపతిరాయణింగారి వంతు వచ్చినది. తిరుపతి రాయణింగారికి సంతానం లేకపోవుట చేత జంగన్నగారి కుమారుడైన భావన్నారాయణంగారు 1208 ఫసలో ప్రభుత్వమునకు వచ్చి 1211 లో రాచూరు తాలుకా కుంఫిణీవారిచేత వేలం వేయనా ఈ గ్రామం రాజమల్రాజు వెంకట గుండారాయణింగారి పరిపాలన లోనికి పోయినది. గ్రామంగుడికట్టు 25 కుచ్చెళ్లు.

జానంచుండూడు: ఇదిగుంటూరు వండురు తాలూకా: 1122 ఫసవీలో మూడు వంతులుగా భాగించి నప్పుడు ఇది రేపల్లేతాలూకాలో చేర్చబడి రమణయ్య మాణిక్యరావుగారి పరం చేయబడగా క్రమముగా మల్లన్న సీతన్న గోపన్న జంగన్న గార్లు 1182 ఫసలీవరకు ప్రభుత్వం