పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
(2) వల్లూరు గ్రామం గుడికట్టు కుచ్చళ్లు 20.

ఈగ్రామం 1122లో రమణయ్య మాణిక్యరాయలంగారు పరిపాలించిరి. 1160 వరకు రమణయ్యగారు వల్లన్నగారు సీతన్నగారు పరిపాలించిన తరువాత నిజాముల్ ములుకు పెద్ద కుమారుడైన నాసర జంగు దీనిని పరాసువారికి యిచ్చినారు. వారు 1160 నుండి 1168 వరకు ప్రభుత్వం చేసి అపజయులు కాగా సీతన్నమాణిక్యారాయణంగారి అన్న కుమారుడు గోపాలరావు మాణిక్యరాయణింగారు 1168లో ప్రభుత్వం చేసి సీతన్నగారి కుమారుడైన జంగన్నగారు 1167 ప్రభుత్వానికి వచ్చి 1178 ఫసలీలో మజుకూరి మిరాసదార్లు అయిన వల్లూరి వేంకటాచలం పర్వతాలు. శంకరప్ప, విస్సంరాజు, పునరుద్ధరించిన గణపేశ్వరస్వామి వీరభధ్రస్వామివార్ల ఆలయములు శ్రీ పూర్వమున్న చెన్నకేశ్వరస్వామివారి ఆలయము మ్లేచ్ఛలచే విచ్ఛిత్తుచేయబడినది కనుక తస్థానే శ్రీ వేంకటగోపాలస్వామివారిని ప్రతిష్టించి శ్రీ ఆంజనేయస్వామినికూడ ప్రతిష్టించిదిరి పై దేవాలయములు శ్రీవారు ఇచ్చిన వసతులు.

కు 1 శ్రీ గణపేశ్వరస్వామి, వీరభద్రస్వామి వార్లకు కు 1 శ్రీ వేణుగోపాలస్వామివార్లకు:

1177 ఫసలీతో కుంఫిణీవారు మృత్తుజానగరుకు ప్రభుత్వానికి వచ్చి 3 సం॥ పరిపాలించి తిరిగి జమీందార్ల పరం చేసినారు. వీర్లకుమాళ్లు భావయ్య మాణిక్యరావు 1202లో రాజ్యమునకువచ్చి వీరు పాలించుచుండిరి.

8. కట్టెంపూడి :—

గోపరాజురామన్నగారు ఈ గ్రామానికి తూములింగన్నగారికి యేకభోగముగా మిరాశీ వ్రాసియిచ్చినారు. ఈ తూములింగన్నగారు గ్రామమునకు దక్షిణభాగమందు కేశవస్వామివారి ఆలయమున్నూ ఉత్తరం శ్రీ మల్లికార్జున ఆలయం కట్టించి వీటికి 080 మాన్యం ఇప్పించిరి ఇదే ప్రకారం 1500 శకంవరకు జరిగెను తరువాత తురకల పరిపాలనలో ఇది విచ్చిత్తు అయినది. అప్పుడు పొన్నూరు సమతులో