పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/23

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మంత్రదేవతాభేదముల ననుసరించి, బ్రాహ్మ్యము ప్రాజాపత్యము వైష్ణవము శైవము ఐంద్రము వారుణము ఆగ్నేయము వాయవ్యము సౌమ్యము (చంద్రదైవతకము) ఆదిత్యము దౌర్గము (దుర్గాదైవతకము) గాణేశ్వరము (వినాయకాధిదైవతకము) స్కాందము శాక్తేయము యాక్షంరాక్షసము నాగము గారుడము గాంధర్వము పైశాచము పైత్రము (పితృదైవతకము) పార్థివము ఆప్యము (జలాధిదైవతకము) తైజసము సావనము నాభసము (ఈకడపటి) యైదును బంచభూతముల గ్రమముగా స్తంభింపజేయునట సాముద్రము పార్వతము గాయత్రము త్రైష్టుభ మానుష్టుభము మొదలగునవిఁ (కడపటిమూడును ఛందోదైవతకము లగు మంత్రములు ప్రయోగములుగా గలవి). ఈ యాయుధశిక్ష కధికారులు క్షత్రియులును బ్రాహ్మణులును దదనుయాయులును నగుదురు. రథగజతురగపదాతులె వానికధికరణములు, ఈ సూత్రపాఠమునఁ బ్రథమపాదమున ధనుర్వేదాభ్యాసమునకు దీక్షాభిషేకశకునమాంగల్యకలణాదికము వివరింపఁబడియె. రెండవదియగు సంగ్రహపాదమున సకలాస్త్రశస్త్రముల సంగ్రహవిధియు మూఁడవది యగు సిద్ధిపాదమున సంగ్రహించిన యస్త్రములకుఁ బునఃపునరభ్యాసమున మంత్రదేవతాైనియమజపహోమోపాసనక్రియలును విస్తరింపఁబడియె. మంత్రదేవత సకళ యనియు నిష్కళ యనియు నిఱుదెఱంగులం బరఁగు. అదియు చేతనావత్త్వము, ఇచ్ఛావిగ్రహత్వము, యష్టవ్యత్వము, తుష్టిమత్వము ఫలదాతృత్వము అను నైగుగుణములు గల దని పూజాహోమోపాసనాదుల సాధకులు నడపుదురు. షోడశోపచారములచే సిద్ధదైవత మిచ్చు ఫలదానముచే సాధకుఁ డస్త్రప్రయోగము నొనర్చుట నాల్గవపాదమున విస్తరింపబడియె. శస్త్రగ్రహణమునకు ధనుర్వేదమున నియమము గలదు. సామదానభేదములచే నసాధ్యుడయి దుర్వినీతుఁ డగు పురుషునిఁ గాని, బహుప్రజాసంరక్షణార్థము తత్పాలకుఁగాని, దేశకాలావస్థోచితముగాఁ గర్తృకరణశక్తి కనుగుణముగా నాపత్కాలమునను, సర్వదా ధర్మరక్షణమునను, దండము విధేయమని శాస్త్రజ్ఞులు గ్రహించిరి.