పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

13


భౌతికాపాదనాధ్యాయః సంధివిక్షేపణం తథా
అక్రమోజ్జీవనోధ్యాయః శ్రమప్రాప్తేర్హి లక్షణమ్
ఆయుధగ్రహణం శిక్షా క్రమస్తత్పరిశీలనమ్
సన్నాహస్థాన చలన మపసవ్యస్థితిక్రమః
ఆశ్లేషోవాంతరాలంబ హస్తాటన పటుక్రియా
ముష్టిబంధస్థానబంధో ధృష్టతాపాదనం తథా
సంగ్రామవిద్యావిజ్ఞానం సర్వాయుధ విలంఘనమ్
సూత్రాధ్యాయః పరీక్షా చ పాదపాయూపఘట్టనమ్
రథాశ్వేభాద్యవస్థాన లక్షణాధ్యాయ ఏవ చ
(విలుంటనం మోటనం చ భ్రమణం పరిశీలనమ్
ఆయుర్జ్ఞానం మోహనం చ భిన్నముల్లాసితం తథా)
చాపాదిలక్షణజ్ఞానమస్త్రాణాం కరణం తథా
అస్త్రమంత్రపరిజ్ఞానాధ్యాయో మదవినిర్గమ
ఏవమాద్యా ధనుర్వేదే విద్యాః సంతి సహస్రశః

అను నిరువదితొమ్మిది యంశములు విస్తరింపఁబడియె. ధనుర్వేదసూత్రములు పరశురామకృతములై శాండిల్యభాష్యవివృతములై కేరళీదేశమున లభించుచున్నవని తెలియుచున్నది. అది నాలుగుపాదములు గలది. ప్రథమము దీక్షాపాదము. రెండవది సంగ్రహపాదము. మూడవది సిద్ధిపాదము. నాల్గవది ప్రయోగపాదము. ధనుశ్శబ్దము సర్వప్రహరణముల వర్తించు. అది ముక్తాది చతుర్భేదకము. ముక్తమనగాఁ జక్ర వజ్ర వలయ శక్తితోమర కుంత పాషాణాదికము. అముక్తమనగా నంకుశ పాశ క్షురికా అసి గదా ముసల దండాదికము. ముక్తాముక్త మనఁ బాశవాగురా రజ్జు వలయాదికము. యంత్రముక్త మనఁ జాప శతఘ్నిశల్యక మంజుషార్క వర్ణాదికము. మనశాస్త్రానుసారముగా సర్వశస్త్రములలో ధనువు శ్రేష్ఠము. వింటియంగములు బాణము అర్థచంద్రము శిలీముఖము నారాచము మోచకము మొదలగునవి. అస్త్రము మంత్రాక్షర ప్రతిలోమ పఠితమై యధిదైవత ప్రేరితమై యుండును.