పుట:Delhi-Darbaru.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వివాహమహోత్సవము.

71


దలి చిన్న గుడిలో నెట్టిరంగు వస్త్రములతో నలంకరింపఁబడిన యాసనముల మీఁదఁ గూర్చుండిరి. పవిత్ర వేదికకు వరుఁడు వచ్చటకుఁ గించిత్పూర్వము, రజత శూర్యముల మంగళ స్వనములును, సామాజికు లెల్లరును నిశ్శబ్దముగ లేచి నిల చుటయును విక్టోరియా మహారాణిగారి రాకను దెలియ పఱచెను. ఆయమ నల్లనివ స్త్రముల ధరియించి యుండెను గాని సుదర్భ శుద్ధికయి నలంకరింపఁ జేసిన బుటేదారు పని వానిని సంపూర్ణ ముగ నావరించుకొని వాని యసిత వర్ణమును పై కెగయ నీకుండెను. వజ్రముల చిన్న కిరీటమును, ' ఆర్డరు ఆఫ్ దిగార్ట'ను బిరుదును సంకేతించు నీలవర్ణపు బట్టెడయు, “ నైటు' పదమును సూవు పెక్కులగుఁ జుక్కలును బ్రపంచము నందలియు త్తమ చక్రవర్తిని కలంకారములయి శోభిల్లు చుండెను. ఇప్పగిది ధగధ్ధగాయ మానమగు విచిత్ర వర్ణముల ప్రవాహము పరిపూర్ణముగఁ బ్రవహించుచుఁ జూపరుల కన్నుల మిఱుమిట్లు గొలుపుచుండెను. వారిదిగ్బ్రమతను బాపుట కోయన నాచార్య సంఘము దమకు సాధారణమగు నుడువులతో సభామధ్య మున కేతెంచిరి. టెక్కు ప్రభువు దనకన్యను జార్జి ప్రభువుకు దానము సేసెను. ఆమెయు మెల్లని స్వనమున సందర్భోచితము లగు పలుకుల నుడివెను. మహామతాచార్యుం డొకచిన్న యుపన్యాసమున వధూవరులకు బోధనా వాక్యములఁ బల్కి యీ వివాహము ఆంగ్లేయ జాతికి శ్రేయోదాయమగు గాత