పుట:Delhi-Darbaru.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

శ్రీరాజ దంపతులు.


తండ్రిగారికిఁ బిల్లనాఁటనుండియు స్నేహితుఁడును, నాంగ్లేయ దేశ భక్తులలో నగ్రాగ్రేసరుఁడును నగు గ్లావస్టన్ రాజనీతిజ్ఞ శిఖామణి మొట్ట మొదటి వారలలో నెక్కఁడుగఁ బ్రవేశించెను. లెక్కకు మారి పిక్కటిలిన యువతీమణుల యాభరణముల నుండియు వస్త్రములనుండియు బయలు దేరు ప్రభలు నలు దిక్కులను వ్యాపించి వింత కాంతుల వెదఁజల్లుచుండెను. ప్రసిద్ధి నొందిన ప్రతి పురుషుఁడును బ్రతి స్త్రీయును వివాహాలయంబునకు వేళకు దప్పక వచ్చియుం డెననుట విశదమయ్యె, బహిరంగణము నందలీ వాద్యవి శేషముల గంభీర స్వసములు మొదటి యూరే గింపు గదలివచ్చుటం దెల్పెను. అచిర కాలములోనే వరుఁడు దనతండ్రి తోడను బినతండ్రి తోడను వివాహాలయము లోనికి బదము లిడుచుండుట గానవ చ్చెను. అతఁడు ధరించిన యుడుపులు నావికా నాయకత్వమును జంహించుచుండెను. అతని నడక యుఁ జేష్టయు నాతని సభాకంపతను బయల్ప జచుచుండెను. మేరా కూతురును శుభ్రమగుఁ దెలుపు గట్టి వెండి జరిగె బుటేదారు పని చకచక లీనుచుండఁ దా ధరించిన గులాబి మున్నగు సుపుష్ప ములకుఁ దన దేహకాంతిచే నెక్కుడు సౌందర్యము నిచ్చుచుఁ గోలఁది కాలములో నె సఖులతోఁగూడ నావివాహమందిరముఁ జొచ్చెను. ఈయుత్సవ సమయమున కేతించిన రాజకీయాతిథు ల నేకులు. అందు రుష్యాజారు కుమారుఁడును, నార్కు రాజ్యపురాజును రాణియు నుండిరి. వీరెల్లరును రాజనగరునం