పుట:Delhi-Darbaru.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

శ్రీరాజ దంపతులు.


విద్య నేర్చుకొనుట కెంతో యీమెను బుజ్జగింప వలసి యుండెను. ఈమెగారి తల్లియు దాదియు మిక్కిలి పరిశ్రమచేసి యీమెకు విద్యయందభిరుచి కలుగ జేసిరి. చరిత్రయనిన నీమెకు మహాభిలాష. ఈమెకు క్రికెటు: మున్నగు వ్యాయామములకుఁ దగినంత కాల మియఁబడుచుండెను. ఆయాటలో నీమె దనసోద రుల ననాయాసముగ మించుచుండెడిది. అట్లగుట నలన నే ఈమె దృఢ కాయయు నారోగ్యవతియు సయి యున్నది. 'సర్గుణముల నాటుటయం దీమె తల్లికిఁగల యాసక్తి పెక్కు తల్లుల కుండ దనిన నతిశయోక్తి గా నేరదు. ఆమె మతము దన బిడ్డలు విశేష సౌఖ్యములకును భ్రమాస్పదములగు నభ్యాస ములకును లోనయి యనదలు గాఁగూడదనుట. ఆయమ ‘విధే యత నేర్చుకొనుటయు, విద్యగఱచుటయు, పెరుగుటయు "నేను పనులు బిడ్డలకుఁ జాలును. విందులకుఁ బలుమారు పోవు టయు, రాత్రు లెక్కుడు నిద్ర గాచుటయు శైశవపుఁ బచ్చద సముం బో నడచి కన్యాత్వవు సౌందర్యమును, గాంతిని సపహ రించును. లోకమున ముసలి శిశువులు లెక్క కుమారి ఇప్పటికే యున్న వారు” అని యొక తరి నుడివెను. మఱియొక సమయమున నొక యాహ్వాన ప్రార్థనకు “దయపూర్ణ మగు తమ కోరికను నెర వేర్ప నా కెంత యిస్టమున్నను రేపటి దినము నాపిల్లలను బంఫుటకు వీలు లేకుండుట కెంతయు: జింతిల్లుచున్నాను. ఈ వారమున రెండు రోజులు నా బిడ్డలు విదులకుఁ బోయి