పుట:Delhi-Darbaru.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మేరీ బాల్యక్రీడలు

61

,

త్సరము జనవరి నెల 14వ తేదీ యితని యన్న క్లారెంసు ప్రభు వకాలపు మృత్యువువాతఁ బడుట తోడనె, యీతని జీవ యాత్రయంతయును నొక్క తృటికాలమున మార్పుఁ జెందెను. ఇతఁడు దండ్రికిఁ దరువాత . రాజ్యమున కర్హు డయినందున నా వికోద్యోగమువదలి రాజకీయ వ్యవహారములయందుఁ బరి శ్రమ సేయవలసిన వాడాయెను. ఇటఁ గొంచెము జార్జి. కొమరుని కథనాపి మేరీ రాణిగారి వంకకుఁ దిరుగుదము.

మేరీ బాల్య క్రీడలు.

ఈమె 1867వ సంత్సరము మే నెల 26 వ తేది కెన్సింగు టను భవనమునఁ బుట్టెను. ఈమె , తండ్రి టెక్కు, ప్రభువు. ఈమె తల్లి విక్టోరియా మహారాజి . గారికి నాలవ. తరపు. బంధువు; అలెగ్జాండ్రా మహా రాణి తాతగారి చెల్లెలి కుమార్తె. మేరీ మహా రాణికి ముగ్గురు తమ్ములు. ఈమె పుట్టిన నెలరోజుల జ్ఞానస్నాన సంస్కారము నడచెను. చిన్నతనమున నీ మెకు 'రాచకుమారి మే' యనునది ముద్దు పేరు. ఈమె తన శైశవమును గుణించి యది మిక్కిలి తుంటరితనముతోడను, నెక్కుడు సుఖముగను, విశేషరాహిత్యముగను గడుపఁబడెనని తానే వర్ణించియున్నది. ఈమెకు బొమ్మలును గుక్కలును ప్రియతమములు. ఎంత వికారముగ నుండినను, నెంత ప్రాతపడి యుండినను, నెంత యుత్కృష్టమగు ప్రత్యామ్నా యవస్తువు నిచ్చినను నీమె తన మొదటి బొమ్మలను విడుచునదిగాదు.