పుట:Delhi-Darbaru.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

శ్రీ రా జ ద ం ప తు లు.


డదాని కంగీకరింపక “ఈనావను సముద్రయాత్రకుఁ గొంపో 'వలసినదని నాకు ముదలగలదు. కావున నేను బోయి రావలెను”. అని నుడివి కొన్ని నిమిషములలో 'స్పీ తేడ్' అను రేవువై పునఁ దన 'నావతోఁ గూడఁ బ్రయాణము సాగించెను. 1885 వ సంవత్సరము. అక్టోబరు (October) మాసములో ' నితఁడు 'ధ్రష్' అను ఆయుధప్లవమును సంపూర్ణ స్వాతంత్ర్యము , నడుప నర్హుఁడయ్యెను.

ఈతని నావికా శక్తి కచ్చటి నా రెల్లనును మిక్కిలి 'సంతోషించిరి. ఇతని తండ్రియు జర్మనీచక్రవర్తియు నితని 'నచ్చటఁ జూడవచ్చిరి. తనతల్లికిని సోదరులకును దన. మొదటి స్వతంత్రోద్యోగమును మిక్కిలి సంతోషముతో, "దెలియఁ జె ప్పెను. 1887 వ సంవత్సరమున విక్టోరియా మహారాణి గారి రాజ్యపంచాశ ద్వార్షికోత్సవ (Jubilee at the Fiftieth Year of her reign) సమయమున జరగిన నావిక ప్రదర్శనము నం దీతఁడు మిక్కిలి పరిశ్రమచేసెను. 1889లో మహారాణి గా రితనిని తమనావి కాపార్శ్వవర్తిగా( Naval aid-de-camp.) నియమించుకొనిరి. 1891లో నితఁడు నాయకుఁడయ్యెను. అసం వత్సర మే యితఁడు 'డబ్లిను' పురమునకు, బోయియుండి యచ్చట గొంచె మపాయ కరమగు జ్వరముచేఁ బీడింపఁ బడెను. కాని కొద్ది కాలములోనే యితనికి దేహము కుదిరి ఇతఁడు దన కర్తవ్యములకుఁ బూనఁ గలిగెను. 1892వ సంవ