పుట:Delhi-Darbaru.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జార్జి నా వికోద్యో గము.

59


1884 వ సంనత్సరమున జార్జిరాబిడ్డఁడు నావికా విద్య యందు మొదటి తరగతిఁ దేరి “ సబ్ లెఫ్టనంటు' పదమున కర్షుఁడయ్యెను. అప్పుడు నావికాధ్యక్షుఁడుగ నుండిన అడ్మిరల్ సర్ జాక్ డాల్రింపిల్ హేయను నతఁడితనిని గూర్చి “ఇతఁడారి తే రిన నావికుఁడు. పేరునకుఁదేరినవాఁడుగాక మాయందఱవలెఁ బరిశ్రమ జేసినవాఁడ"ని నుడివియున్నాఁడు. జార్జి యిల్లుఁ జేరి గ్రీన్విచ్చు పట్టణమునందలి “ రాజకీయ నావికా లాశాలయం దభ్యసింప మొదలిడెను. మంచిగదుల జత యొక్కటి దక్క నిచ్చట నితనికమర్చిన ఏ విశేష సౌకర్యము లేమియు లేవు. బుంధువుల ఛా యాపటములను బుష్కలముగ వ్రేలాడవైచి యాగది కితఁడలం కారము నిచ్చుచుండెను. 1885 లో నితఁడు లెప్టినెంటుగా నేర్ప, ఱుపబడెను. “థండరరు' ' డ్రెడునాటు'. 'అలెగ్జాండ్రా' అను మూఁడోడలలో నుద్యోగముసలిపెను.

1889 లో నితఁడొక నాశక ప్లవమును (Torpedo) నడపుచుండెను. అప్పుడితని యధికా రితనిని రావించి “మి తండ్రిగారగు " ప్రిన్సు ఆఫ్ వేల్సు గారు మిమ్మును గుడ్ వుడ్ అను నెడకుఁ బుపవలసినదనియుఁ దామట మిమ్మును జూడ వేచియుందురనియు వర్తమానమంపి యున్నారని చెప్పెను. దానికితఁడు “సరే. అయ్యా! అయిన నా నాశక ప్లవము గతి యేమి కావ లెను?” అని ప్రత్యుత్తరమిచ్చెను. దాని కాయధికారి ఇతనికానాఁటికి సెలవియ్యం గలుగుననియెను గాని, యీతఁ