పుట:Delhi-Darbaru.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

శ్రీ రా జ ద ం ప తులు.


జార్జినావికోద్యోగము.

పండ్రెండు సంవత్సరములు నిండిన తోడనె ఇతఁడన్న గారితోఁ గూడ నావికా సైన్యమునఁ బ్రవేశ పెట్టఁబడెను. (క్రీ! శ|| 1877 వ సంవత్సరము జూన్ నెల 5న తేది. వీరితో నింకను నూటయేబదిగురు బాలుకు నావి కావిద్య నభ్యసించు చుండిరి, వీరును వారును శయ్యా విషయంబులఁదక్క సర్వవిధముల సమా నముగఁ జూడఁ బడుచుండిరి. జార్జిచక్రవర్తి నేటికిని దానచ్చటఁ] గడపిన కాలమును సంతోషము , సరియించు చున్నాడు. తన పుత్రులఁగూడ నచ్చటి కె విద్యాభ్యాసము నకుఁ బంపియుం డెను. “బాక్కాంటె' యను నోడమీఁద జార్జి 'రాబిడ్డఁడును నితని యన్న యు నిద్దఱును మధ్యధరా సముద్ర మార్గమున పశ్చిమ యిండియా దీవులకుఁ బోయి. ఆ ప్రయాణము వలన జార్జికి సముద్ర యానము పై నెక్కుడభిమానము గలిగెను. క్రీ! శ|| 1830 వ సంవత్సరమున ' బాక్కాది' ప్రపంచము చుట్టి రాఁబయన మయ్యెను. దానియందును దరువాత “ కనడా యను నోడయందును బ్రయాణము చేసి 1883 లో నుత్తర అమెరికాకుఁ బోయిచే రెను. అట మాంట్రియల్ , ఒటావా, టొరాంటోమున్నగు గొప్పపట్టణములను దర్శించి ఆయా ప్రదేశ ములను జూచుచు 'నయాగరా' మహాజల ప్రపాతమున కలరి రాబోవు సంబంధమువలనఁగలుగు ననురాగమునకుఁ జిహ్న మో యనునట్లు 'కనడా' రాష్ట్రము పైఁ బ్రేమగలవాఁడయ్యెను.