పుట:Delhi-Darbaru.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మే రీ బా ల్య క్రీడ లు.

63


యుండిరి. ఎక్కుడు కాలము దుర్వ్యయము సేయుట వలన వారి విద్యాభ్యాసమునకు బలమగు నాటంకము గాఁగలదు. కావున నాయభిప్రాయ 'మెఱింగిన వారు నన్ను క్షమింతురు గాక' యని వ్రాసి పంపెను. ఇంతి యెకాదు. మేరీగారి తల్లి దన బిడ్డ లితరుల కష్టములను జక్కగ నెఱింగికొని వారి యెడల సానుభూతి గలవారయి వారికి సాహాయ్య మొనర్ప సమర్థులుగావ లెనని కోరునది. ఆమె దేశాభిమానమునకు మేర లేదు. బీదల యెడ నామెకుఁ గల యనురాగము మెండు. ఇత రులను దనవలె నెంచుకొని వారి కెప్పుడును నామె మేలు సేయుచుండును. రా కొమారి మేయును నామె సోదరులును నితరుల కొఱంతలను దెలిసి కొనుటకై వారిని మతాచార్యు లతో దరిద్రుల గృహముల కనుపు చుండును. ఇట్టీ మాత చేఁ బెంపఁబడిన దగుట చే మేరీరాణియు నా సుగుణముల కాల వాలమయ్యెను.

1883 వ సంవత్సరమున మే తల్లిదండ్రులు ప్లారెంసున నివసింప నేగిరి. అచ్చట నీమెకు చిత్రకళాభవనములందుఁ గల పటములఁ జూచుటకును బట్టణ వై చిత్రముల దర్శించుటకును సమయము గలిగెను. ప్లా' రెంసున దివ్యమగు గానము గొల్లలుగ నీరి వీనుల దనుపుచుండెను. మే రాకుమార్తెకు వర్ణ లేవన విమర్శ నాశక్తి యచ్చటనె కలిగెను. వీరు తిరిగి యింగ్లాండునకు వచ్చిన తరువాత విక్టోరియా మహారాజీ ‘రిచ్చిమండు' పట్టణము