పుట:Delhi-Darbaru.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జార్జి 'బాల్య క్రీడ లు.

57



కళంకు లేక యెట్టి హిమము నైనను సరకు " సేయక ప్రవేశించు చుండుననిన నితని సాహసస్వభావము తేటపడఁగలదు. ఒక చిన్న కథ. 'బాలొరాలు నగరమున రాచనగరునం దీ రాకోమరుఁ డుండుతరి - నితని 'సహాధ్యాయుఁ డొక బాలు డుండెను.--అతఁడిప్పు డాంగ్లేయ ప్రభు సభయం డౌన్నత్యముగనిన సభ్యుఁడు. — - అతఁడు జార్జి బిడ్డనితో దాగుడు మూతలాడు చుండెను. ఆయాట యందు జార్జి పలుమారు దొంగ యయ్యెను. దానికిఁ గారణము పై బాలుఁ డైనందున " నతని నీతఁడు సహింప లేక ముష్టి యుద్ధమునకుఁ బిలిచెను. ఆపిడికిటి పోట్లాటలో నతనిదె పయిచేయి యయ్యెను. కానీ దానివలన వీరిద్దఱకును స్నేహ భావ మేమాత్రమును . దఱుఁగక మిక్కిలి యన్యోన్య మైత్రి యేర్ప డెను.

బాల్మొరాలు భవనమున జార్జి రాబిడ్డఁడు యుద్ధమునకు వలయు కరత్రముల (Gloves) జతలను బెట్టుకొని యూవనులగు నావికులకుఁ బ్రియమగు నీ వ్యాయామమునకుఁ బలుమాఱు కడఁగుచు స్వసంరక్షణమునందు సమర్థుఁ డయ్యెను. ఇట్లు రాకొమరులకు బహిర్వ్యాయామములకు నాటంకము సెప్ప కున్నను వారి తలిదండ్రులు 'విద్యా విషయమున మాత్రము వారి నుదాసీనులుగ నుండనిచ్చినవారుగారు. జార్జిరాకొమ రుఁడు దీప్రగ్రాహికాడు గాని యెప్పుడును బట్టుదలగల వాఁడు గావునఁ దత్ఫలము నందఁగలిగెను.