పుట:Delhi-Darbaru.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

శ్రీరాజదంపతులు


వంతునిచే నియమింపఁబడిన యిట్టి యిఱుకు జలభాగమునకు జలసంధి యని పేరు. పై నుడివిన - జలసంధి యుదకముల రాకొమరులు జలకమాడుటకలదు. అట్టి తరుణముల మన జార్జి 'నాబిడ్డఁడె నిర్భయముగ నందఱకంటే మున్ను నీటఁ జొరఁబడు చుండును. అప్పుడె యితనికిని దరువాత రుష్యా జారుపదము నధిష్టించిన నికలసన్ అను నితని బంధువునకును మైత్రి సమ కూరెను. మొదటినుండి సాహసక్రియలయు దితని కభిరుచి మెండని నుడువఁబడియున్నది. ఏపనికిఁ బూనినను మిక్కిలి యుత్సాహముతోడఁ బూనువాఁడు. గుఱ్ఱపు స్వారి. చేయు నెడల నెల్లను బ్రారంభమునందే యితఁడు గనుపఱచుచు వచ్చిన సౌలభ్యమును జూచిన ముందీతఁడు చక్కని రౌతు గాఁగలఁడని విశదముగఁ దెలియుచుండెడిది. గొప్ప వేట కాండ్ల సమూహ ములను . జేరుటకు నాసక్తి తో నితఁడు నెడలి, వేటకుక్కలతో సమముగఁ దనయశ్వమును బరువెత్తించుచుండును. ఇ గ్లాండు నందు శీతకాలమున మైదానములు హిమవుఁ బఱపుగలవయి యుండును. మనపిల్ల కాయలు జారుడు బండ పై నాటలాడుకొను నట్లాంగ్లేయ బాలురు బాలికలును నీ హిమముమీఁదఁ గుతూ హలముతో నాటలాడుచుందురు. అయిన నీమాటలు మనము వీనితోఁ బోల్చిన జారుడుబండలయాటలకంటే నెక్కుడపాయ కరములనుట హిమము స్వభావమునుబట్టియే మాచదువరు లెఱుఁగఁగలరు. ఇట్టి వ్యాయామములలో జడ్జి రాబిడ్డకు జంకు