పుట:Delhi-Darbaru.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూఁడవ ప్రకరణము.

శ్రీ రాజదంపతులు.

జార్జి బాల్య క్రీడలు.

జార్జిచక్రవర్తి క్రీ! శ|| 1865 సనత్సరమున జూన్ నెల 8వ తేదీ మారల్బరో సదనమున జన్మమందెను. అదే నెల 7వ తేది మహా రాజీ విక్టోరియాగారి సన్నిధియం దీ-బిడ్డడు కై స్తవ మతాచారము ననుసరించి జ్ఞానస్నానమను సంస్కారము మొందెను. ఇతని శైశవము నందు విశేషము లెవ్వియు లేవు. ఏడేండ్ల బాలుఁడగు నప్పటి కితఁడు నావికా సైన్యమునకు నర్హు డని నియమింపఁబడి నాఁటినుండి యీతని విద్యాదిపరిశ్ర మలు తదనుసరణముగఁ బన్నఁబడెను. సెలవు దినములలో నొక కొన్నిటి నితఁడు దన తలితండ్రులతో డెనార్కు రాజు గారి యాతిధ్యము క్రింద కోవన్ హేగను పురమునఁ గడపుట తటస్థించెను. కోపన్ హేగను రేవుపట్టణము, అచ్చట సము ద్రము మిక్కిలి యిఱుకు. ఆవల నీవల గొప్ప సముద్రభాగము లుండి యా సముద్ర భాగములను గలిపి వేయుట కయి భగ