పుట:Delhi-Darbaru.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

ఢిల్లీ న గ ర చరిత్రము.


యీచతుష్కోణాకృతియగు నంగణమున నైదు వేలసంఖ్యగల ముసల్తానులు ప్రార్థనార్థము చేరుటకు వీలుగలను. ఈమసీదు నందు ముఖ్యాంగమగు నంతరాలయ మీ చద రమునకు .పశ్చిమభాగమున నున్నది. ఇది పశ్చిమమున నుండుట కుఁ గారణము మక్కా-పడమర నుండుటయె. ప్రతిమహమ్మ దీయుఁడును దైవము ను బ్రార్ధించు నెడ మక్కా ప్రక్క కు దిరుగ వలయునని యొక సిద్ధాంతము. కావున నీయంతరాలయముఁ జొచ్చుట తోడనే భక్తులు పశ్చిమాభిముఖులై యుండునటుల సౌకర్యముకలుగఁ జేయుటకు పడమట చివర నె యిది గట్టఁబడి నది. ఈ యంతరాలయము దీర్ఘచతుష్కోణాకృతి కలదయి పొడవున 201 అడుగులును వెడలుపున 120 అడుగులును నున్నది. దీనిశిరోభాగమున మూఁడు గొప్పగుమ్మటములు గలవు. వీని పై బంగారు నీరుతో వ్రాయఁబడిన చిత్తరువులున్నవి. ఇంతియేగాక యీయంతరాలయపు రెండు చివరలను రెండు మినారులు 180 అడుగుల యాన్నత్యముగలవి ప్రౌఢముగఁ గన్పించుచుఁ బ్రక్క ప్రదేశమునఁ గలమేడలకంతకును మేమె రాజులమని చాటు తెఱంగున నర్థవర్తులాకారము లై కిరీటము లఁ బోలుచిన్న గుమ్మటములను ధరించియున్నవి. మసీదు ముందరి భాగము మహా ద్వారమున కీవల నావల నై దేసి . సొంపులు గులుకు కమానుల చే నలంకరింపఁ బడియున్నది.