పుట:Delhi-Darbaru.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జుమ్మా మసీదు.

37


కేరడము లాడుచున్న దనిన నిద్దాని ప్రాముఖ్యతను వర్ణించిన వార మగుదుము.

ఇది కట్టుబడిన స్థలము మిట్టప్రదేశము. అక్కడ మున్నుం డిన గుట్టను చదరము చేసి యాచదరము పయినది నిర్మి బడినది. దీనికి నాలుగునై పులను మార్గములుకలవు. "కాని ప్రవే శద్వారములు తూర్పు, ఉత్తరము, దక్షిణము, ఈమూఁడు పార్శ్వములందుమాత్రమేగలవు.పశ్చిమద్వారము బొత్తిగనశించి పోయినందున సచ్చట నున్నతములగు భిత్తులు మాత్రమె కాన వచ్చుచున్నవి. ద్వారములుగల మూఁడు నైపులను నదీఘట్టములఁ జూపట్టు సోపానపరంపరలఁ దిరస్కరించు పడికట్లు కట్టఁబడియు న్నవి. ముఖ్య ద్వారము లిత్తడితోఁ బోయఁబడిననగుటచే మిక్కిలి ఘనమై విశాలముగఁ గన్పట్టుచుండును. అందులో బూర్వద్వార మెక్కుడు సౌందర్యము గలదియు దళమైనదియు నై మహాద్వారమని పిలువ నర్హముగ నున్నది. ఈ ద్వారమునఁ జొచ్చి లోపలికి నడచినచో గొప్పయంగణ మొకటి గానవచ్చును. ఇది 1400 చదరపు గజములు గలదు. దీని ' నట్టిల్లొక (Floor) విధమగు నెఱరాతిపఱపు గలిగియున్నది. తన్మధ్యమున సంగ మర్మ రుశిలలతో నిర్మితమయిన కృతక సరోవరం బొండొప్పు చుండును. దీనిలోని కీ గుట్టపయినుండు జీవఝరములనుండి శుధోదకము ప్రవహింపఁ జేసియున్నారు. ఇట్లలంకృతమయిన