పుట:Delhi-Darbaru.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జుమా మసీదు.

39



ఈకట్టకపు మధ్యమున నొక చోట శుభమగు నల్ల రాతి పయి స్వచ్ఛమగు సంగమర్మరుశిలలతో నక్షరములు దీర్పఁబడి యున్నవి. ఈ శాసనమున నీమసీదున కైనవ్యయమును మసీదు ప్రారంభిచి ముగించిన తేదీలును నీయఁబడియున్నవి. దీని ననుసరించి చూడకీ| శ || 1841 లో ప్రారంభమయి 1850 మధ్యమునకు నీ మసీను పూర్తియయినట్లు తేలుచున్నది. సుమా రా రేండ్ల కాల కట్టడమునకయి 5000 పనివారలు చమట. నూడ్చుచుండిరి. అప్పటి లెక్కల ననుసరించి దీనికి పదిలక్షల రూపాయిలు పట్టినట్టు తెలియుచున్నది.

ఈముసీదు. మధ్య భాగమున నొకచోట నట్టిల్లంతయు సంగమర్మరము పఱచిన ప్రదేశమున మూఁడడుగుల పొడవును ఒకటినరయడుగు వెడలుపును గల కమానులు ' దీర్చఁబడియు న్నవి. వీని మొత్తము సంఖ్య 900. ఇట్లు ప్రత్యేకించి పెట్టఁ బడిన స్థలముల బాదుషాహలును నమీరులును నవాజు సేయు టకుఁ గూర్చొనుచుండిరి. ఢిల్లీయందు బాదుషాహ నగరున . నెచ్చటను మసీదు గానరాదు. కావున నతఁడు ప్రార్థనార్థము దన సర్వసామంతులతో నీ మసీదున కే వచ్చుచుండి నట్లును నీ స్థలము లట్టి యూహతోడనె కట్టఁబడియున్నట్లును నిశ్చయముగఁ జెప్పు వచ్చను. మధ్యగుమ్మటపు క్రింది భాగమున నక్షీ పని సర్వోత్కృ స్టముగఁ జేసియున్నారు. దీని కెదుట ముఖ్యమతాచారుల పీఠ మఖండనుగు నొక్క-సంగమర్మరశిలతో నిర్మింపఁబడి యున్నది.