పుట:Delhi-Darbaru.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుతుబ్ మినారు.

27


లోకము నందలి యద్భతములలో ముఖ్యము లేడు గల వని పాశ్చాత్యులలో ఒక వాడుకగలదు. ఆ యేడింటిలో నొక్కటియగు కుతుబ్ మినారను జయ స్తంభము. ఢిల్లీ నగర మున నున్నది. విశ్వకర్మ స్తుతి యీ కట్టడమునఁ గానవచ్చుట బట్టియు దీని స్వరూపము హైందవ శిల్పి కాపద్ధతిని స్పష్టముగం గనుపఱచుచుండుట వలనను నిది పృధివీరాజు వలనఁ బ్రారం భింపఁ బడెనువారి వాదమునకు సమ్మతింప వలసి యున్నది- క్రీ! శ. 1191 లో మహమ్మదీయుల నోడించి వారి పైఁ దా నందిన విజయమును సూచింప నీతఁ డీమినారును బ్రారంభించెనని , కొందఱును, నితని పుత్రిక యమునానదిని ప్రతిదినమును దర్శించి నభిలాషగల దగుటచే నాయమ ప్రీత్యర్ధమై యిది ప్రారంభింపఁ బడెనని మణికొందఱును జెప్పుచున్నారు. ఏది యెట్లన్నను శిల్పి కాపద్ధతిని బట్టి యిది హైందవనిస్త్రాణమని నిశ్చయింపక తీరదు. పృధివీ రాజున కనంతరము కుతుబుద్దీను దీనిని దనయవ సరములకుఁ దగురీతిని మార్చి యుపయోగించి యుండును. అతని కిది రెండువిధములఁ బనికి వచ్చెను. హైందన రాజుల నోడించి వేయించిన జయ స్తంభముగను దన మతస్థులగు నాచార్యులు సాయంసమయముల భక్తులను దైవ ప్రార్థనకుఁ బిలువ నుప యోగకరమగు మినారుగను సతఁ డిద్దానిని బ్రవర్తింపఁ జేసెను.