పుట:Delhi-Darbaru.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

ఢిల్లీ న గ ర చ రి త్రము.


కార్యస్థాన మొక్కటి నేర్పఱచి యచ్చట జరీకిగాను కఱగఁబడు సువర్ణ రజతములను బరీక్షించి జరీని నాణ్యము సెడకుండం జేయుచున్నారు. దానివలన నే భరతవర్షమున నెచ్చటను ఢిల్లీ జరీకిఁ బేరు పెట్టువారు లేరు. నవీనయంత్రాలయ నిర్మాణము ఢిల్లీయందు బాగుగ వృద్ధియగుచున్నది. దూదివడుకు యంత్ర శాలలును గుడ్డలు నేయు యంత్రశాలలును నాలుగుగలవు. పిండి చేయు యంత్రశాలలు 3 గలవు. చెఱకునాడు యంత్రశా లలు మూఁడు గలవు. అచ్చుయంత్రశాలలును, బిస్కత్తులు చేయు యంత్రశాలలును, ఇనుము ఇత్తడిమున్నగు లోహము లతోబని సేయు యంత్రశాలలును గలవు.


రాజవుత్ర స్థానమునకును కలకత్తా బొంబాయిలకును వ్యాపారమంతయు ఢిల్లీ మార్గమున నడచుచున్నది. కావున నిది వాణిజ్యమున నెం తేని వన్నె కెక్కియున్నది.


ఢిల్లీ కోటయందు కొంత ఆంగ్లేయ సైన్యము నిలుపఁబడి యున్నది. తోపుఖానా (ఫిరంగులుండు ప్రదేశము) యొకటియు, స్వల్ప సంఖ్యాకులగు సైనికులును గలరు. సిపాయీల కాల్బల మును ఆశ్విక సైన్యమును మఱియొక చోట గలవు. ప్రాచీన ఢిల్లీ ప్రదేశమున నొక్కెడ నిప్పటి ఢిల్లీకిఁ బదు నొకండు మైళ్లదూరమునఁ బ్రతివర్షర్తు వందును గొప్పసంత జరుగును. బహుదూరమునుండి వేలకొలది జనులాస్థలమునఁ జేరుదురు.