పుట:Delhi-Darbaru.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

ఢిల్లీ న గ ర చరిత్రము.



దీనిప్రక్కన నొక దివ్యమగు "హైందవ దేవాలయ ముం డెడిది. దానినిగూడ కుతుబుద్దీను కుతుబ్ మసీదుగ మార్చివేసెను. బానిస వంశీకుఁడయ్యును కుతుబుద్దీను చూపిన బుద్ధి కౌశల్య ముచే నతఁడు త్తమ పరిపాలకులలో నెక్కఁగుగఁ బరిగణింపఁబడ 'నర్హుఁడు సుందరవస్తువును మతా వేశము చే నశింషఁ జేయుట మాని యుపయు క్తమగు భంగి సంస్కరించి నిలువ జేయుట యందఱకును సాధ్యముగాదు కదా !

ఇప్పుడు కుతుబ్ మినారు 238 అడుగల యెత్తుగలదు. శ. 1794 లోఁ గొలిచినప్పుడు 242 అడు లుండెడిది. పిడు గులు భూకంపములును నిట్టియున్న తమగు కట్టడములకు వైరులు కావున నప్పటికే వీని ప్రభావము వలన దీని శిఖర మూడిపోయి యుండెను. అందువలన శిఖరమునకుగాను ఇంకను పదియడుగులు, పదియన నేల ఇరునదిగూడ, జీర్చవలసి యుం డును. క్రింది భాగమున దీని చుట్టుకొలత 48 అడుగుల 4 అం గుళములు. ఈమినా రైదుభాగములుగఁ గట్టఁబడియున్నది. మొదటి 97 అడుగులొకమందము; 97 నుండి 148 నఱకును మఱియొక మందము; 148 నుండి 188 వఱకును వేరొకమంద ము; 138 నుండి 214 వఱకును నాలుగవ మందము; తరు వాత కడపటి భాగము. పీఠమునుండి శిఖరమువఱకును బోను ఫోను మందము గ్రమక్రమముగఁ దగ్గుచుండును. ఒక్కొక్క యుతస్థును వేరుపలుచి మినారున కలంకారము నొసఁగుటకే