పుట:Delhi-Darbaru.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొగలాయవంశము.

17



డును స్వచ్ఛమగు తెల్లని పచ్చడము గప్పియుందురు. దీని కెదుటి పార్శ్వమునను, దీని నడి నెత్తికి సూటిగను నమూల్య మగు ' షామియా' ( Semiane)విందులు గురిపించు చుండును. అచ్చటచ్చట చిన్న చిన్న మేజాల పై ఒక కొన్ని గ్రంథములు గాన నగును. వీని ప్రక్కన నె హుమాయూనువరకత్తి, పాద

హుమాయూన్ గోరీ.


రక్షులు మున్నగునవి ప్రదర్శింప బడియున్నవి. నగరమునను నగరప్రాంతములను రమామి యిరువదిగురు పఠాను రాజుల దివ్యసమాధులు గలపు, భరతవర్షపురాజు లెల్ల రును నీ పురమునందె పట్టభద్రులు గావలెను. లేకున్న వా రాక్రమికులుగ నెన్నఁబడుదురు. సుందరోద్యాన వనముల చేతను ప్రాచీనశోభాచిహ్నములగు కట్టడముల చేతను జుట్టఁబడిన బయ