పుట:Delhi-Darbaru.pdf/372

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

346

మైసూరు రాజ్యము.


కృష్ణ రాజ ఒడయరు.

పూర్ణయ్యను దొలఁగించి కృష్ణ రాజ ఒడయరు రాజ్యము నేల మొదలిడెను. బొక్క సము సంపూర్ణముగ నిండియుండిన స్థితి లో పదునాఱేండ్ల బాలుఁడగు నీభూపాలుఁడుపరిపాలనము ప్రారం భించి మూఁడుసంవత్సరములలో రాజ్యమును దారిద్ర్యమునకు దెచ్చి విడిచెను. స్తోత్రపాఠకులును, పరాన్న భుక్కులును, ఇతనికి ప్రాణ మిత్రులగుటవలన రెసిడెంటుగారి సంభాషణములును రాజ్యములోని భారతీయ పౌరుల నీతివచనములును ఇతని చెవున కెక్కినవిగావు. ఆంగ్లేయ ప్రభుత్వము వారు కొంతకాలమితనిని జంకించిచూచిరి. అప్పటికీని ఇతఁడు తనమార్గమునువదలినవాఁ డుగాఁడు. ద్రవ్యము లెక్క లేక వెచ్చ పెట్టఁబడుచుండుటవలనను. సైన్యమునకై అప్పులు పెరుగఁజొచ్చియుండుటవలనను పూర్ణ య్య చే నుపక్రమింపఁబడిన వసూలు పద్ధతిలో ని పైకనుపఱచిన లోపముచే నది మహాక్రూరముగ నుపయోగి పఁబడుట ప్రారం భమయ్యెను. ఉత్తమోద్యోగము లన్ని యును ఏలములో నమ్మ బడ మొదలిడెను. ఇంతియెగాక న్యాయ తీర్థానముల విషయ ముసఁ గూడ ప్రజల కరాజకము సంభవించెను. ఏన్యాయాధిపతి కిని శిక్ష, వేయు నధికార ముండినదిగాదు. అతఁడు ముద్దాయి నేరస్థుఁడని తీర్మానించిన తరువాత రాజు స్వయముగ నే శిక్షవిధిం చుచుంటయాచారము. కాబట్టి రాజు సోమరియగుటతోడనే న్యాయ తీర్మానములయందు భరింపరాని ఆలస్యము పొడసూ పెను.