పుట:Delhi-Darbaru.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కమీషను పరిపాలన.

347



ఇప్పగిది ఒక్కటి పై నొక్కటిగ నష్టములు ప్రజలకు సంభవింప నారంభించినందునఁ గ్రము క్రమముగ . నసంతుష్టి ప్రబలెను. 1830 న సంవత్సరమునఁ దిరుగు బాటులు ప్రారంభమయ్యెను. ఆంగ్లేయ సైన్యము లవ్వానినఁణచుటకు సాయము పోవలసి వచ్చెను. నగరము తాలుకాలో జరిగిన తిరుగుబాటును ఎదు ర్చుటకు సాహాయ్య సైన్యమంతెయును వలసి వచ్చెను. మిక్కిలి కష్టము మీఁద తిరుగుబాటు సైన్యములు విరిసిపోయి శాంతి సమకూరెను. తిరుగు బాటునకుఁ గారకులయిన ఒకరిద్దరు నాయకులు మాత్రము కొన్ని నెలల కాలము విడువక మైసూరు సీమను వేధించిరి. ఇట్టి స్థితిలో గవర్నరు జనరలుగారు కృష్ణ రాజ ఒడయరును సింహాసనమునుండి తొలఁగించుట శ్రేయ స్కరమని యెంచి ఆసంగతిని అతనికిఁ దెలియఁ జేసి ఇద్దరు కమీషనరులను రాజ్య భారమునకు నియోగించెను. రాజు వారి చేతికిఁ దన దేశము నప్పగించి మైసూరు నందలి తన నగ. రులోఁ గాలముఁ గడపఁగడఁగెను.

కమీషను పరిపాలన.

మైసూరు రాష్ట్రము ఈవిధముగ 1831. మొదలు 1881 వఱకును సంపూర్ణముగ ఆంగ్లేయుల ప్రభుత్వము క్రిందికి నచ్చెను. ఈఏబది సంవత్సరములను పరిపాలనా పద్ధతుల నను సరించి మూఁడు భాగములుగ విభజింప వచ్చును. మొదటి భాగమున పూర్ణయ్య చే నుపక్రమింపఁబడిన పద్ధతులే న్యాయా