పుట:Delhi-Darbaru.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

336

మైసూరు రాజ్యము.


మహారాష్ట్రులు ఎత్తివచ్చుట అకారణముగఁ గాదు కావున తాము సాహాయ్యమియ్య వలనుపడదని ప్రత్యుత్తరమిచ్చిరి. అందుచే హైదరు మహారాష్ట్రులకు లొంగి మిక్కిలినష్ట పడి వారిని మంచితనమునకుఁ దెచ్చకొనవలసి వచ్చెను. ఇట్టి విపత్కాల మునఁ జేయి.పిడిచిన ఆంగ్లేయ పరిపాలకుల పై అతనికి కినుక పుట్టి వృద్ధియగుచుండెను. అయిన నతఁడు మహాయుక్తి మం తుఁడు గావున దానినంతయును నప్పటికణఁచిపెట్టుకొని 1772 లో కొడగు రాజ్యమును ఆక్రమించి సమయము దొరకి నట్లెల్ల మహా రాష్ట్రులకుఁ దా మున్న ర్పించిన భూభాగము ను వశపఱచు కొనుచుండెను. ఇదికనిపెట్టి 1773 లో నుహారాష్ట్ర ప్రభువు రఘోబా హైదరును మర్దింప నే తెంచెను. కాని అతడుఁ దైస్యము సహించి రఘోబాను పేష్వాపట్టమున కొప్పుకొనుట "నభినయించి కొంత పైక మిచ్చెదనని వాగ్దానము చేసి తప్పించు కొనెను.


1778వ సంవత్సరమున అమెరి కాయందు ఆంగ్లేయ ప్రభుత్వము పై తిరుగుబాటు చేసి తన్మూలమున నేఁటి ప్రసిద్ధ సంయు క్త రాష్ట్ర మేర్పఱచిన అధిని దేశ ప్రజలకు ఫ్రెంచివారు సాయము చేసినందున ఇంగ్లాంపునకును ఫ్రాంసునకును విగ్ర హము ప్రారంభమయ్యెను. భరత వర్షము లోని ఆంగ్లేయ సైన్యములకు ఫ్రెంచివారి పట్టణములను ముట్టడించుట కర్తవ్య మయినందున నొక ఆంగ్లేయపటాలము మాహీ' యను పశ్చిమ