పుట:Delhi-Darbaru.pdf/343

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాళేగా రులు.

317


ప్రసిద్ధి గాంచిన శ్రీ కృష్ణ దేవరాయలు. ఈతని కాలమున నుండిన విజయనగర సామ్రాజ్యముతోఁ దులఁ దూగఁ గల్గు సామ్రాజ్యము మఱి యొక్కటి దక్ష్మిణ హిందూ స్థానమున నెప్పుడును స్థాపింపఁబడ లేదు. కృష్ణ దేవరాయలకుఁ దరువాత విజయనగర సామ్రాజ్యము రాను రాను అరాజక మగుచు వచ్చెను. కొంతకాలము గడచిన వెనుక అళియ రామరాజుసంపూర్ణ స్వతం త్రాధికారి యయ్యెను. అతఁడు మహావిక్రమశాలియై దక్షిణహిం దూస్థానము పై కృష్ణ దేవరాయనం బోలియెనిజ శక్తిని వ్యాపింప జేసెను. విడిపోయిన బహమని రాజ్యశాఖలలో విభేదము లు గూడఁ బుట్టించివారిమీఁద నధికారము సంపాదించెను. కాని ఇతఁడు గొంచెము గర్వము గలవాఁడై ప్రవర్తించుటచే మహమ్మదీయ సుల్తానులుమేల్కాంచి ఒక్కటిగఁ జేరి 1565న సంవత్సరమునఁ దల్లి కోటకడ నీతని నెదిర్చి జయించి చంపి వేసిరి. విజయనగరసామ్రాజ్య మంతటితోనంతరించెను. రామరాజు సోదరులు తిరుమల రాజును వెంకటాద్రియును వరుసగ పెనుగొండ యందును.చంద్రగిరి యందును స్థానము లేర్పఱచు కొనిరి.