పుట:Delhi-Darbaru.pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
318

మైసూరు రాజ్యము.


పాళేగారులు.

ఇట్లు విజయనగర సామ్రాజ్యమును రూపు మాపిన మహమ్మదీయ సుల్తానులు దమలోఁ దమకుంగల ఈర్ష్యలవలన నాసామ్రాజ్య స్థానము నాక్రమించుకొన లేరై డి. విజయనగరా ధీశ్వరులు పూర్ణ శక్తితో పరిపాలించు చుండిన పదునారవ శతాబ్దమున నుత్తర దేశ మంతయును జక్రవ ర్తిగారి వలన నే పరిపాలింపఁ బడుచుండెను. దక్షిణ భాగము, ముఖ్యముగ మైసూ రుసీమ, అనేక ఖండములుగ విభజింపఁబడి అచ్చటి సామంత రా జుల ఆధీనమున కియ్యఁబడి యుండెను. వీరు చక్రనర్తిగారికి కప్పములుగట్టుచు యుద్ధ సమయముల సేనల నమర్చుచుండిరి. వీరందటిపై శ్రీరంగ పట్టణమున చక్రవర్తిగారి ప్రతినిధి యుండె డివాడు. విజయనగర సామ్రాజ్యము తలికోట యుద్ధములో విరియునప్పటికి శ్రీరంగపట్నమున శ్రీరంగరాయలు ప్రతినిధిగా నుండెను. సామ్రాజ్య విచ్ఛిన్న మయిన తరువాతఁ గూడ నీప్ర తినిధికిని పెనుగొండ యందలి చక్రవర్తిగారి కుటుంబమున కును సామంతరాజులుగ నుండిన వారు కొంత కాలము పేరు నకు గౌరవము గనుపజచుచు వచ్చిరి. కాని బలనంతులగు సా మంతులం దఱును నొక్కరొక్క రుగ స్వతంత్రులుగా కొచ్చి రే. ఇట్లు స్వతంత్రులైన వార లే పాళేగాగులని పిలువఁ బడు చున్నారు. ఇప్పటి మైసూరువంశము అట్టి పాళేగారులలో నొ