పుట:Delhi-Darbaru.pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
316

మైసూరురాజ్యము.



సంగముని సంతతిలో నెనమండ్రుగురురాజులు రాజ్యమేలి.. వారిలో రెండవ హరిహర రాయల కుమారుఁడు దేవరాయలు ప్రతాప దేవ రాయలను బిరుదు పేరు నందెను.ఈతని కాల మున విజయనగరమును దర్శింప నే తెంచిన ఇటాలియా దేశస్థుఁ డగు 'నికలో డికాంటి' యను నతఁడును పారసీక దేశీయుఁడగు అబ్దుర్ రజాకును విజయనగర సామ్రాజ్య రాజధాని సంపద్వై భవములను వర్ణించియున్నారు.

సంగమరాజులలో కడపటివారి కాలమునకు బహమని సుల్తానులలో నొక్కఁడగు రెండన మహమ్మ దుషాహ విజయనగర సంస్థానమునం దెక్కుడు భాగము నాక్రమించుకొనఁ జొచ్చెను. అప్పుడతని నెదురుకొని జయిం చిన వాఁడు సాళువ నరసింహుఁడు. ఇతఁడు సంగ రాజుల ప్రతి నిధిగ తెలుఁగునామును పరిపాలించు చుండిన సేనానియగుటం చేసి క్రమక్రమముగ నీతనిశక్తి యభివృద్ధియై యుండెను. ఇతఁడు మహమదీయుల నోడించిన తరువాత నచిర కాలములోనే విజయనగర సింహాసనము నాక్రమించుకొనెను. కాని యీతని సంతతి కై నను ఆసామ్రాజ్యము నిలిచినది కాదు. ఈతని కడముఖ్య సహాయులుగ నుపచరించు చుండిన తుళువ వంశజులగు నీశ్వ రుఁడను నరసింహుఁడును మహాబలను తులయి యుండిరి. ఈతనికిఁ బిదప విజయనగగ సంస్థానమును నరసింహుడు కైవ సముచేసికొని ఏల మొదలిడెను. ఆతని పుత్రుఁడే లోక