పుట:Delhi-Darbaru.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పశ్చి మ చాళుక్యు లు.

307


విభేదములు వచ్చినట్లున్నది. కావున రాష్ట్రకూటుల శక్తితగ్గుచు వచ్చినందున వారు పశ్చిమ చాళుక్యులకు 973 వ సంవత్సర మున లోఁ బడిపోయిరి.

పశ్చిమచాళుక్యులు.

మఱల చాళుక్య సామ్రాజ్యము ప్రారంభ మయ్యెను. ఆహనమల్ల బిరుదాంకితుఁడయిన తైలపుఁడు పశ్చిమచాళుక్య సామ్రాజ్య పునఃస్థాపకుఁడు. ఇతఁడు కక్కలుఁడను రాష్ట్రకూ టుని జయించి యాతని బిడ్డను పెండ్లాడి రెండువందల సంవత్స రముల కాలము దినదిన ప్రవృద్ధంగాంచి మించునట్లు దైవము చే నియోగింపఁబడిన సామ్రాజ్యమును సంపాదించి పెట్టి స్థిరకీర్తినందెను. ప్రథమచాళుక్య వంశమువారు పల్లవులతో వలె నీతని సంతతివారు చోళులతోఁ బోరాడవలసి వచ్చెను. క్రమ క్రమముగ పల్లవులను జయించి కంచిని గొని ఇతర రాష్ట్రముల నాక్రమించుకొనఁ జొచ్చియుండిన చోళులు గొంత కాలము దూర్పు చాళుక్యమండల మరాజక మయినందున నదియదను చేసికొని పశ్చిమ చాళుక్యుల లోఁబఱచుకొనఁ బ్రయత్నించిరి. ఈ పోరాటము రెండు పక్షముల వారికిని జయాపజయములు నిశ్చయములుగాక బహుకాలము జరిగెను. ఇరువారుల వారి సీమలకును యుద్ధములవలన మహా నష్టములు సంభవించెను. విగ్రహమధ్య కాలమున చాళుక్య రాజధాని కల్యాణునకు మారువఁబడెను.